Vikram: విక్రమ్ హెల్త్ బుల్లెటిన్‌.. డాక్టర్లు ఏమన్నారంటే ?

Published : Jul 08, 2022, 06:33 PM IST
Vikram: విక్రమ్ హెల్త్ బుల్లెటిన్‌.. డాక్టర్లు ఏమన్నారంటే ?

సారాంశం

హీరో విక్రమ్‌ కి గుండె పోటు అనే వార్త అందరిని కలవరానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసింది. 

హీరో విక్రమ్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన హార్ట్ ఎటాక్‌ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై అంతా ఆందోళన చెందారు. సడెన్‌గా విక్రమ్‌ ఇలా ఆసుపత్రి పాలు కావడం, అదికూడా గుండెపోటుతో ఆసుపత్రిలు చేరడం అందరిని షాక్‌కి గురి చేసింది. అభిమానులు,సినీ వర్గాలు సైతం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాజాగా కావేరి ఆసుపత్రి వైద్య బృందం విక్రమ్‌ హెల్త్ పై మెడికల్‌ బుల్లెటిన్‌ విడుదల చేసింది. 

ఈ సాయంత్రం ఆసుపత్రి వైద్యులు విక్రమ్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. `విక్రమ్‌ ఈరోజులు చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరారు. అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు జస్ట్ చెస్ట్ లో పెయిన్‌ వచ్చింది. కానీ అది హార్ట్ ఎటాక్‌ కాదు. విక్రమ్‌ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జి చేస్తాం` అని ఓ బుల్లెటిన్‌ విడుదల చేసింది. 

దీంతో విక్రమ్‌ అభిమానులు, కోలీవుడ్‌ సినీ వర్గాలు రిలాక్స్ అయ్యారు. వైద్యుల బుల్లెటిన్‌తో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పుడూ వర్కౌట్స్‌ చేస్తూ హెల్దీగా ఉంటారు విక్రమ్‌. ఎంతో ఎనర్జీగానూ ఉంటారు. అలాంటిది విక్రమ్‌కి గుండెపోటు అనే వార్త సర్వత్రా ఆందోళనకి గురి చేసిన విషయం తెలిసిందే. తాజా ఆసుపత్రి వర్గాల ప్రకటనతో అంతా రిలాక్స్ అయ్యారు. ఇక ఈ సాయంత్రమే విక్రమ్‌ నటించిన మణిరత్నం `పొన్నియిన్‌ సెల్వన్‌ 1` టీజర్‌ విడుదలైంది. విజువల్‌ వండర్‌గా ఉన్న టీజర్‌ కనువిందు చేస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో విక్రమ్ తో పాటు కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో