ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మంగ్లీ,.. గౌరవం వేతనం ఎంతో తెలుసా..?

By Mahesh JujjuriFirst Published Nov 23, 2022, 12:58 PM IST
Highlights

తెలంగాణాకు చెందిన ప్రముఖ జానపద గాయని మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఏపీ ప్రభువ్వం నుంచి ఆమెను సలహాదారుగా నిమిస్తు ఉత్వర్వులు ఇచ్చారు కాని ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. 
 

ప్రముఖ సినీ, జానపథ  గాయని మంగ్లీకి ఏపీ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆమె కళకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కింది.  టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెను నియమించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నియమించారు. మంగ్లీ  రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 

ఇక ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు లక్ష వేతనం ఏపీ గవర్నమెంట్ నుంచి అందుతుంది. గతంలో వైఎస్ ఆర్సీపి తరపున కూడా ప్రచారం చేసింది మంగ్లీ. జగన్ కు సబంధించిన పాటలు కూడా పాడింది. ఈక్రమంలోనే ఆమెకు ఈ పదవి దక్కినట్టు తెలుస్తోంది. అయితే ఆమెను  ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితమే  ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. 

కాకపోతే ఈ విషయం కాస్త  ఆలస్యంగా బయటకు వచ్చింది. తెలంగాణ జానపథ గాయనిగా కింది స్థాయినుంచి ఎదిగారు మంగ్లీ.  ఒక న్యూస్ ఛానల్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. స్టార్ గా మరింది. ప్రతీ పండగకు ఆమె చేసే ప్రైవేట్ ఆల్బం కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదరుచూసేవారు. అలా అలా సినిమాల్లో పాడే అవకాశం రావడంతో.. ఒక్క పాటతో తన టాలెంట్ ను నిరూపించుకుని.. వరుస అవకాశాలు అందుకుంటుంది మంగ్లీ. 

ఇక ఎంతో కష్టపడి  ఈ స్థాయికి చేరుకున్న మంగ్లీ ..2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. వీటితో పాటు ఉత్తమ గాయనిగా ఎన్నో అవార్డ్ లు అందుకుంది మంగ్లీ. 

click me!