Mangalavaaram : ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి ‘మంగళవారం’.. ఎక్కడెక్కడ అంటే?

అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘మంగళవారం’ మూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాను ఏపీలోని కొన్ని థియేటర్లలో ఒకరోజు ముందే చూసే అవకాశం కల్పించారు. 
 

Google News Follow Us

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి (Ajay Bhuapthi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం Mangalavaaram.  ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి హైప్ ను క్రియేట్ చేసింది. సినిమానూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) , 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 

అయితే సినిమాను ఒక రోజు ముందే రిలీజ్ కు ఏర్పాట్లు చేశారు. ఏపీలో పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఒకరోజు ముందుగానే నవంబర్ 16న (రేపు) ఏపీలోని కొన్ని థియేటర్లలో ప్రీయియర్స్ ను ప్రదర్శించనున్నారు. విజయవాడలో  - క్యాపిటల్ సినిమాస్, వైజాగ్ - శరత్, నెల్లూరు - ఎంఐ సినిమాస్, కాకినాడ - చాణక్య, భీమవరం - ఏవీజీ మల్టీప్లెక్స్, గుంటూరు - గౌరీ శంకర్ థియేటర్లలో పెయిర్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ను కూడా ప్రారంభించారు. రేట్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 

సినిమా రిలీజ్ కు ముందే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన ‘అప్పుడప్పడ తాండ్ర’ (Appadappada Thaandra)  సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. నవంబర్ 11న హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా... ఆ వేడుకకు అల్లు అర్జున్ (Allu Arjun)  హాజరై సినిమాకు మరింత హైప్ ఇచ్చారు. రాబోతుండటం విశేషంగా మారింది. చిత్రంలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. 

 

Read more Articles on