Mandana Karimi: ఆ డైరక్టర్ నన్ను గర్భవతిని చేసి వదిలేశాడు,మోసం బయిటపెట్టిన నటి

Surya Prakash   | Asianet News
Published : Apr 11, 2022, 10:27 AM IST
Mandana Karimi: ఆ డైరక్టర్  నన్ను గర్భవతిని చేసి వదిలేశాడు,మోసం బయిటపెట్టిన నటి

సారాంశం

 మోడల్ కమ్ నటి  మందనా కరిమి తన జీవితాల్లోని అతి పెద్ద రహస్యాన్ని చెప్పి కంటెస్టెంట్లతో పటు అభిమానులకు కూడా షాకిచ్చింది. తనను ఒక డైరెక్టర్ పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది.


బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్‌.  ఈ షోలో కంటెస్టెంట్లు సంచలనాత్మక సీక్రెట్లు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ షో లో చెప్పే కబుర్లుతో కంటిస్టెంట్లు సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను బయటపెట్టి షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు మోడల్‌, నటి మందనా కరిమి భయటపెట్టిన సీక్రెట్‌ అందరిని షాక్ కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే...
 
 మోడల్ కమ్ నటి  మందనా కరిమి తన జీవితాల్లోని అతి పెద్ద రహస్యాన్ని చెప్పి కంటెస్టెంట్లతో పటు అభిమానులకు కూడా షాకిచ్చింది. తనను ఒక డైరెక్టర్ పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ” నా భర్తతో విడిపోయాక నేను ఒక ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నాను. అతను ఎప్పుడు మహిళల హక్కుల కోసం పోరాడుతూ ఉండేవాడు. దీంతో అతడిపై ప్రేమ కలిగింది.  అతను  కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ ఆతర్వాత ఇద్దరం ఒక్కటయ్యాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం.. ముందు దీనికి ఒప్పుకొని నేను గర్భవతి అయ్యాక అతను నను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన నన్ను డిఫ్రెష్ లోకి తీసుకెళ్లిపోయింది. ఆ సమయంలో నా స్నేహితులు, సన్నిహితులు నాకు ఎంతో ఓదార్పునిచ్చారు” అంటూ కన్నీరుమున్నీరయ్యింది.

ఇక ఆమె వ్యధ వవిన్న కంటెస్టెంట్లు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇకపోతే మందాన 2017లో వ్యాపారవేత్త గౌరవ్‌ గుప్తాను వివాహమాడింది. కొన్నేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తరువాత విబేధాల వలన విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మందాన ను మోసం చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు