స్టార్ కమెడియన్ ఇంట్లో కుప్పలుగా 2000 రూపాయల నోట్లు, వెన్నెల కిషోర్ పై మంచు విష్ణు ట్వీట్ వైరల్

Published : May 22, 2023, 07:41 PM ISTUpdated : May 22, 2023, 07:46 PM IST
స్టార్ కమెడియన్ ఇంట్లో కుప్పలుగా 2000 రూపాయల నోట్లు, వెన్నెల కిషోర్ పై మంచు విష్ణు ట్వీట్ వైరల్

సారాంశం

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఇంట్లో కుప్పలుగా 2000 రూపాయల నోట్లు. రిజర్వ్ బ్యాంక్ వాటిని బ్యాన్ చేయడంలో ఇలా బయటకు వచ్చాయట. ఇంతకీఈ విషయం బయట పెట్టింది ఎవరో తెలుసా..? మా అధ్యక్షులు మంచు విష్ణు. ఇంతకీ ఏంటీ ఆరోపణ. దానికి కమెడియన్ సమాధాణం ఏంటీ..? 

రీసెంట్ గా రిజర్వ్‌ బ్యాంక్‌ అందరికి షాక్ ఇచ్చింది. 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  నిర్ణయం తీసుకోవడంతో.. ఈ నిర్ణయంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సామన్య ప్రజల దగ్గర నుంచి.. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల్లో కొంత మంది  ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ.. కామెంట్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కామెంట్లు చేస్తున్నారు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఈ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం.ఇక ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు  ఈ నోట్ల రద్దుకు సబంధించి చేసిన పోస్ట్.. ఓ కమెడియన్ పై ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 

టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్‌ వెన్నెల కిషోర్ ఇంట్లో 2 వేల రూపాయల నోట్లు  కుప్పులు కుప్పలుగా  పడి ఉన్నాయంటూ.. ఆరోపణలు చేయడంతో పాటు.. తన ట్విట్టర్ లో ఓ ఫోటో కూడా శేర్ చేశాడు మంచు విష్ణు. ఆ పోటోలు 2000 రూపాయల నోట్లు కుప్పగా పోసి ఉన్నాయి. దాంతో ఒక్క సారిగా ఇండస్ట్రీతో పాటు.. ఆడియన్స్, అంతా ఉలిక్కిపడ్డారు. వెన్నెల కిషోర్ మీద ఈ ఆరోపణ చేయడంతో అంతా షాక్ అయ్యారు. పైగా ఈ ఫోటో వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ తీశానంటూ.. కామెంట్ కూడా చేశాడు విష్ణు ఇప్పుడు ఆయన వీటిని ఏం చేస్తాడో అంటూ ట్వీట్ చేశాడు విష్ణు.. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

తన ఇంట్లో 2 వేల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అంటూ ట్వీట్ చేయడంతో..  మంచు విష్ణు ట్వీట్‌పై వెన్నెల కిశోర్ స్పందించారు. హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ ను చంపేసినట్లు, నా మీద పడ్డారేంటి? అంటూ ఆహుతి ప్రసాద్ చెప్పిన డైలాగ్‌ను పోస్టు చేశారు. దాంతో ఇది మంచు విష్ణు కామెడీగ పెట్టినట్టు అందరికి అర్దం అయ్యింది. దాంతో వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్  సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

ఇక ఈ విషయంలో నెటిజన్లు కూడా ఫన్నీగానే స్పందిస్తున్నారు. చాలా డబ్బులు ఉన్నాయి మాకు కొన్ని ఇవ్వచ్చు కదా అని కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నేను ఇల్లు కట్టుకుంటాను నాకు డబ్బు ఇవ్వండి సార్ అంటూ మరికొంత మంది, ఈ డబ్బుతో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా చేస్తాను అంటూ ఇంకొంత మంది కామెంట్లు పెడుతున్నారు. పనిలో పనిగా మంచు విష్ణును ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియా జనాలు. ముందు తమ్ముడితో మంచిగా ఉండు.. ఆయనకు బర్త్ డే విష్ కూడా చేయలేదు కాని.. ఇలా కామెడీ పోస్ట్ లు మాత్రం పెడుతున్నావు అంటూ.. విష్ణును ట్రోల్ చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?