టైటిల్ కోసమే 2 కోట్లు.. కూలిపోయిన 3 కోట్ల సెట్టు, హిందీ ఛత్రపతికి అనవసర ఖర్చులు అన్నికోట్లా..?

Published : Mar 31, 2023, 07:49 AM IST
టైటిల్ కోసమే 2 కోట్లు.. కూలిపోయిన 3 కోట్ల సెట్టు, హిందీ ఛత్రపతికి అనవసర ఖర్చులు అన్నికోట్లా..?

సారాంశం

ఛత్రపతి సినిమాను హిందీలో భారీ బడ్జెట్ తో చేస్తున్నారు దర్శకుడు వినాయక్. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ఎంట్రీ ఇస్తోన్న ఈమూవీ కోసం.. అనవసరంగా పెట్టిన ఖర్చులు కోట్లు దాటాయంట.

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఛత్రపతి.  తెలుగులో  ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాను హిందీలో రూపొందిస్తున్నారు. ఈసినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ  ఇస్తున్నాడు. అక్కడ మార్కెట్ లో పేరు తెచ్చుకోవాలి అని చూస్తున్నాడు. అయితే ఇది అంత ఈజీగా సాధ్యం అవుతుందా..? 

రీసెంట్ గా హిందీ ఛత్రపతి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజమౌళి సినిమాకు.. వినాయక్ యాక్షన్ టచ్ ఇచ్చి చేసినట్ట ఉంది. ఈ టీజర్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. అసలు ఏ ధైర్యంతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఇంత సాహసం చేస్తున్నాడో తెలియడంలేదు. ఛత్రపతి సినిమా బాలీవుడ్ ఆడియన్స్ కు తెలియనిది కాదు. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అవ్వగానే... తెలుగు ఛత్రపతి హిందీ డబ్బింగ్ వర్షన్ ను లక్షల సార్లు చూశారు. మరి ఇప్పుడు కొత్తగా వారు చూసేదేంటి. 

బెల్లంకొండ శ్రీనివాస్ కు టాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా.. హీరోగా స్టార్ డమ్ రావడంలేదు. దాంతో హిందీలో ఒక ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఈసినిమా చేస్తున్నాడు. అందులోనూ.. బెల్లంకొండ తెలుగు సినిమాలన్నీ హిందీలో రికార్డ్ స్థాయిలో చూశారు జనాలు. దాంతో అక్కడ తనకు పాపులారిటీ ఉంది.. కాబట్టి సినిమా చేసినా కూడాచూస్తారు అని అనుకుంటున్నాడు యంగ్ హీరో. అయితే అది సాధ్యమయ్యేపనేనా..? ఇక ఈసినిమాకు భారీగా బడ్జెట్ కూడా పెడుతున్నారు. దానితో పాటు వేస్ట్ ఖర్చులు కూడా ఈసినిమాకు ఎక్కువగానే అయినట్టు తెలుస్తోంది. 

ఫిల్మ్ ఫోకస్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి బడ్జెట్ విపరీతంగా పెట్టేశారు. పైగా వేస్ట్ ఖర్చులు కూడా చాలానే అయ్యాయట. ఈ సినిమాలో చేయడానికి  హీరోయిన్లు ఎవరూ  ఒప్పుకోలేదట. నుష్రత్ భరుచ్చా అనే అమ్మాయికి 3 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ పారితోషికం ఇచ్చారట. నిజానికి బాలీవుడ్ లో ఆ అమ్మాయికి హీరోయిన్ గా నటిస్తే.. కోటి నుంచి కోటిన్నర మాత్రమే ఇస్తారు. దాంతో డబుల్ ఖర్చు ఇక్కడే కనిపిస్తుంది  ఇక  ఈసినిమా కోసం భారీగా సెట్లు కూడా  వేశారు. అయితే అప్పుడే.. కోవిడ్ రావడంతో.. ఆ  టైంలో షూటింగ్ సాధ్యం కాలేదు.. దాంతో  వర్షాలకు సెట్ కూలిపోయి 3 కోట్లు నష్టం కూడా వచ్చిందట. 

అన్నింటికంటే పెద్ద ఖర్చు ఏంటంటే..  ఈ మధ్యనే ఫిక్స్ చేసిన ఛత్రపతి  టైటిల్ కు మరో 2 కోట్లు ఖర్చు చేశారట టీమ్. ఇలా దాదాపు.20 కోట్ల వరకు అసలు అవసరం లేని ఖర్చులు ఈసినిమా కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తంది. దాంతో సినిమాకు బడ్జెట్ 80 కోట్లు దాటిందని సమాచారం.  మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా వైరల్ అవుతుంది ఈన్యూస్. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌