Manchu Vishnu: నాన్న కంటే కూడా మా ఆవిడ అంటేనే భయం..!

Published : Mar 01, 2023, 03:24 PM IST
Manchu Vishnu: నాన్న కంటే కూడా మా ఆవిడ అంటేనే భయం..!

సారాంశం

మంచు విష్ణు పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర సోషల్ మీడియా పోస్ట్ చేశారు. భార్య అంటే భయం అంటూ కొంచెం డిఫరెంట్ గా స్పందించారు.   


మంచు విష్ణు పెళ్లి రోజు నేడు. 2009 మార్చి 1న ఆయన విరానికా రెడ్డి మెడలో తాళి కట్టాడు. వీరిది ప్రేమ వివాహం. స్నేహం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. మంచు విష్ణు-విరానికా రెడ్డిలకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు ట్విన్స్. 14 ఏళ్లుగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. మ్యారేజ్ యానివర్సరీ నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నాన్న మోహన్ బాబు కంటే కూడా నా భార్య అంటేనే భయం... అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కాగా ఫ్యాన్స్ పెళ్లిరోజు  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

విరానికా రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత చెల్లెలు. ఆయన బాబాయి కుమార్తె. రాజారెడ్డి చివరి కొడుకైన సుధాకరెడ్డి కూతురే విరానికా రెడ్డి. ఇక మంచు విష్ణు తండ్రి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2003లో విడుదలైన విష్ణు చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యాడు. మంచు విష్ణు కెరీర్లో ఢీ సూపర్ హిట్ గా ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. పాతిక చిత్రాలకు పైగా ఆయన నటించారు. 

ఆయన లేటెస్ట్ మూవీ జిన్నా గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం రాలేదు. వసూళ్లపరంగా  జిన్నా మంచు విష్ణుకి మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక 2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షడిగా గెలిచారు. ఆయన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఏడాది చివరి వరకు మంచు విష్ణు మా అధ్యక్షడిగా ఉండనున్నారు. 

కాగా మంచు విష్ణు తమ్ముడు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నారు.  మార్చి 3న ఆయన పెళ్లి  జరగనుంది. మంచు మనోజ్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. కర్నూల్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికను ఆయన వివాహం చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు.  మౌనికతో వివాహం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్న వాదన వినిపిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Disaster Movie: 70కోట్లు పెట్టి తీస్తే, కనీసం టీ ఖర్చులు కూడా రాలేదు.. మోహన్‌లాల్‌ చెత్త సినిమా ఇదే
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం