చిరంజీవి విడుదల చేసిన `మోసగాళ్లు` ట్రైలర్‌.. ఈ సారి మంచువిష్ణు గట్టిగానే కొట్టేలా ఉన్నాడు!

Published : Feb 25, 2021, 07:35 PM IST
చిరంజీవి విడుదల చేసిన `మోసగాళ్లు` ట్రైలర్‌.. ఈ సారి  మంచువిష్ణు  గట్టిగానే కొట్టేలా ఉన్నాడు!

సారాంశం

మంచు విష్ణు ఈ సారి డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో వచ్చాడు. ఓ రకంగా ప్రయోగం చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌ని ఇతివృత్తంగా చేసుకుని `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తున్నారు. జెఫ్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ గురువారం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు చిరంజీవి. 

మంచు విష్ణు వరుసగా పరాజయాలతో ఉన్నారు. ఆయన హిట్‌ కొడదామని ఎంత ట్రై చేసిన అస్సలు వర్కౌట్‌ కావడం లేదు. రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలు తనకు వర్కౌట్‌ కావని కాస్త లేట్‌గానే తెలుసుకున్నాడు మంచు విష్ణు. ఈ సారి డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో వచ్చాడు. ఓ రకంగా ప్రయోగం చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌ని ఇతివృత్తంగా చేసుకుని `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తున్నారు. జెఫ్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ గురువారం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు చిరంజీవి. 

తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హీరోయిజంతో కాకుండా కంటెంట్‌ బేస్డ్ గా ఈ ట్రైలర్‌ సాగుతుంది. ఇద్దరు ఇండియన్స్ అమెరికాలో ఐటీ స్కామ్‌ చేయడం, ఈ సందర్భంగా చోటు చేసుకునే ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా ట్రైలర్‌ ఉంది. చూడబోతే మంచు విష్ణు ఈ సారి గట్టిగానే కొట్టేలా కనిపిస్తున్నారు. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కంటెంట్‌ ప్రధానంగా సాగే చిత్రమిదని అర్థమవుతుంది. టెక్నీకల్‌గానూ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, నవదీప్‌, కాజల్‌, నవీన్‌ చంద్ర వంటి వారు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలువబోతున్నారని చెప్పొచ్చు.

ట్రైలర్‌ విడుదల సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, `2015లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ముంబయి, గుజరాత్ లలో ఉండి ఒక సింపుల్ ఐడీయాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్ చేశారు. అది ఎలా చేశారు. ఆ డబ్బు ఎక్కడుంది.. ఇంతకీ వాళ్ళు దొరికారా? లేదా?అనే ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని చేశాం.  అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ స్కామ్ వల్ల అక్కడ  కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. యూఎస్ లో ఉండి ఈ కథని డెవలప్ చేశాం. మూడు సంవత్సరాలు `మోసగాళ్లు` కథపై వర్క్ చేశాం. హాలీవుడ్ స్థాయికి ధీటుగా  జెఫ్రీ ఈ చిత్రాన్ని ఫెంటాస్టిక్ గా తెరకెక్కించాడు. 

కథ నచ్చి కాజల్ ఈ సినిమాని ఎంతో స్పోర్టివ్ గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కాజల్ హీరో.. మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. అలాగే సునీల్ శెట్టి గారు పోలీస్ క్యారెక్టర్ చేశారు. అలాగే నవదీప్, నవీన్ చంద్ర, వై వ హర్ష టెరిఫిక్ క్యారెక్టర్స్ చేశారు. డైమండ్ రత్నబాబు, గౌతమ్ రాజు గారు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ కాపీ చూశాక చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చాలా నెర్వస్ గా కూడా ఉంది.  సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అడిగిన వెంటనే మా చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్‌గారికి ధన్యవాదాలు` అని తెలిపారు. 

ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ కాజల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించిన ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం