మళ్ళీ న్యూజిలాండ్ కు మంచు విష్ణు, కన్నప్ప కంప్లీట్ అయినట్టేనా..?

Published : Feb 29, 2024, 03:27 PM IST
మళ్ళీ న్యూజిలాండ్ కు మంచు విష్ణు, కన్నప్ప కంప్లీట్ అయినట్టేనా..?

సారాంశం

సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు మంచు విష్ణు. కన్న ప్ప సినిమా కోసం మరోసారి న్యూజిలాండ్ చేరారు. అందేంటి అక్కడ షూటింగ్ అయిపోయిందికదా..? అని అనుకోవచ్చు.. కాని అసలు విషయం ఏంటంటే..?  

మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ప్రాతిష్టాత్మక సినిమా కన్నప్ప. ఈమూవీషూటింగ్ దాదాపు చాలా వరకూ అయిపోయింది. న్యూజిలాండ్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిన టీమ్.. కొంత భాగం హైదరాబాద్ లో షూటింగ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈమూవీ కోసం మంచు విష్ణు మరోసారి న్యూజిలాండ్ వెళ్లాడట.ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప తాజా  షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ మేరకు మూవీ టీమ్ న్యూజిలాండ్ వెళ్ళింది. అక్కడ రెండు  షెడ్యూల్‌స్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా వెళ్లారు. ఇప్పటికే  న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసి.. లాంగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న 'కన్నప్ప' టీమ్ మళ్లీ ఇప్పుడు తాజా షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది.

 

ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. 'కన్నప్ప' సినిమాపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. 

ఇదివరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా 'కన్నప్ప' మూవీని తెరకెక్కిస్తున్నారు. న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఇండియాన్ స్టార్ ఆర్టిస్ట్ లంతా ఈసినిమాలో కనిపించబోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్