మంచు మనోజ్‌ రెండో పెళ్లి ?.. హాట్‌ టాపిక్‌

By Aithagoni Raju  |  First Published Mar 6, 2021, 3:07 PM IST

మంచు మనోజ్‌కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. అదే సమయంలో పర్సనల్‌ లైఫ్‌లోనూ స్ట్రగుల్‌ అయ్యాడు. దీంతో ఇప్పటికే తన మొదటి భార్యకి విడాకులిచ్చారు. తాజాగా ఆయన రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారట.  


మంచు మనోజ్‌ రెండో పెళ్ళి చేసుకోబోతున్నారా? అంటే అవుననే వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తనయుడైన మంచు మనోజ్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత కాలంగా ఆయనకు సక్సెస్‌ లేవు. దీంతో కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. అదే సమయంలో పర్సనల్‌ లైఫ్‌లోనూ స్ట్రగుల్‌ అయ్యాడు. ఆయన ప్రణతి రెడ్డిని ప్రేమించి 2015లో వివాహం చేసుకున్నాడు.

తమ ఫ్యామిలీలో వచ్చిన మనస్పర్థాల కారణంగా రెండేళ్ల క్రితం తాను తన భర్య ప్రణతి రెడ్డి నుంచి విడిపోతున్నట్టు ప్రకటించాడు. విడాకుల కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. కొంత కాలంగా తెలిసిన ఓ అమ్మాయితో సన్నిహిత్యంగా ఉంటున్న మంచు మనోజ్‌ త్వరలోనే ఆమెని వివాహం చేసుకోవాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Videos

మంచు మనోజ్‌ చివరగా `ఒక్కడు మిగిలాడు` చిత్రంలో నటించారు. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం `అహం బ్రహ్మాస్మి` చిత్రంలో నటిస్తున్నారు. హర్రర్‌ థ్రిల్లర్‌గా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు మంచు విష్ణు తమకి చెందిన శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలకు చెందిన పనుల్లో బిజీగా ఉన్నారు.
 

click me!