మనం పందుల కంటే హీనమా..? మంచు మనోజ్ కామెంట్స్!

Published : Mar 20, 2019, 12:38 PM IST
మనం పందుల కంటే హీనమా..? మంచు మనోజ్ కామెంట్స్!

సారాంశం

మంగళవారం నాడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. 

మంగళవారం నాడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో జరిగిన మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు మంచు మనోజ్.

ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు. తన సినిమా జూన్ లో ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఓటు హక్కు ప్రాధాన్యతను  వివరించారు.

ఈ మధ్యనే తాను కొన్ని మార్కెట్ లో జంతువుల ధరలు తెలుసుకున్నానని, మంచి గేదె దాదాపుగా రూ.80వేల ధర పలుకుతుందని చెప్పారు. మేక రూ.8 వేల వరకు ఉంటుందని,  పంది ధర రూ.3 నుండి 5 వేల వరకూ ఉందని తెలిపాడు.

మన ఓటు ధర రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతుందని.. అంటే మనం పందుల కంటే హీనమా..? అని ప్రశ్నించాడు. డబ్బుకి అమ్ముడిపోయి ఓటు వేయొద్దని సూచించాడు. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి