
మంచు మనోజ్ నిన్న(శుక్రవారం రాత్రి) భూమా మౌనిక పెళ్లి చేసుకున్న విసయం తెలిసిందే. మాజీ మంత్రి(లేట్) భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డిని చాలా కాలంగా ప్రేమించిన మనోజ్ ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే తమ పెళ్లిని మరోసారి ఖరారు చేశారు మంచు మనోజ్. తన భార్య మౌనిక చేతిలో చేయి వేసి ఆమె బాధ్యత నాదే అన్నట్టుగా, దైవ సాక్షిగా, వేద పండితుడి సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా మౌనికా రెడ్డి తనది అనేట్టుగా ఉండే ఫోటోని పంచుకున్నారు. ఇది `శివుడి ఆజ్ఞ `అనే అర్థంలో మనోజ్ ఈ ఫోటోని షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ ఫోటోలో ఓ చిన్న కుర్రాడి చేతులు కూడా ఉన్నాయి. మనోజ్, మౌనిక చేతులపై ఆ కుర్రాడి చేతులున్నాయి. దీంతో ఇప్పుడిది సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ కుర్రాడు ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మనోజ్‌కి మొదటి భార్య ప్రణతి రెడ్డితో పిల్లలు లేరు. అలాగే మౌనిక రెడ్డి మొదటి వివాహంలోనూ పిల్లలున్నట్టు సమాచారం లేదు. మరి ఈ కుర్రాడు ఎవరనేది పెద్ద ప్రశ్నగా మారింది.
మంచు విష్ణుకి ఓ కొడుకు ఉన్నాడు. ఆ కుర్రాడి ఇలా పట్టుకున్నాడా? లేక ఈ అబ్బాయి వేరా ? అనేది సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మొత్తంగా మనోజ్ మరోసారి ఓ ఇంటివాడయ్యాడు. మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకుని కొత్తగా ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే మనోజ్ పెళ్లి ... మోహన్‌బాబుకి ఇష్టం లేదనే పుకార్లు వినిపించాయి. కానీ పెళ్లిలో ఆయన కనిపించి ఆ పుకార్లకు చెక్ పెట్టారు.
మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగానే ఉన్నా మనోజ్.. మౌనిక ప్రేమలో పడ్డారు. అప్పటికే గణేష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మౌనిక ఆయనతోనూ విడిపోయింది. ఒంటరిగానే ఉంది. దీంతో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. చాలా రోజులుగా సహజీవనం చేసినట్టు సమాచారం. గతేడాది వినాయక చవితి సమయంలో మౌనికతో కలిసి ఓ టెంపుల్‌ని సందర్శించి వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే ఊహగానాలకు తెరలేపారు. ఇప్పుడు మార్చి 3న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.