హృతిక్ రోషన్ ఎమోషనల్ పోస్ట్, తన జిమ్ ట్రైనర్ గురించి స్టార్ హీరో ఏమన్నాడంటే..?

Published : Mar 04, 2023, 06:58 PM IST
హృతిక్ రోషన్ ఎమోషనల్ పోస్ట్, తన జిమ్ ట్రైనర్ గురించి స్టార్ హీరో ఏమన్నాడంటే..?

సారాంశం

చాలా మంది స్టార్ హీరోల కండల వెనుక కనిపించని ట్రైనర్లు ఉన్నారు. వారు తెర వెనకు ఉండి.. హీరోలు హ్యాండ్సమ్ గా కనిపించడానికి కారణం అవుతున్నారు.అటువంటివారిని తెరముందు చూపించే హీరోలు చాలా తక్కువ. కాని బాలీవుడ్ సూపర్ హిరో హృతిక్ మాత్రం తనకోసం కష్టపడ్డ తన ట్రైనర్ ను ప్రపంచానికి చూపించాడు.. పొడగ్తలతో ముంచెత్తాడు. ఇంతకీ హృతిక్ ఏమన్నాడంటే..?

వార్, విక్రమ్ వేదా సినిమాల  ద్వారా  అభిమానులను పలకరించాడు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. అయితే అందులో విక్రమ్ వేద మాత్రం అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక త్వరలో ఫైటర్‌  సినిమా కోసం బరిలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసం జిమ్ లో కుమ్ముతున్నాడు హృతిక్. అసలే కండల వీరుడు.. ఇక ఇంకాస్త ఎక్కువ జిమ్ చేస్తే.. హాలీవుడ్ హీరోలను మించిపోతాడు హృతిక్. ఇక ఈక్రమంలో...తన శరీరాన్ని ఫైటర్ కోసం రెడీ చేసే పనిలో ఉన్నాడు హృతిక్.  ఫిట్‌నెస్‌ మీద మరింత దృష్టి పెట్టాడు. ఈ విషయం మరోసారి ప్రత్యేకమైన చర్చకు దారి తీసింది. అందుకు కారణంఆయన జిమ్ ట్రైనర్.  

ఫైటర్ సినిమాలో పర్‌ఫెక్ట్‌ ఫైటర్‌ బాడీ కోసం హృతిక్‌ ఇంకాస్త అదనపు కసరత్తులు చేశాడు. ఈ క్రమంలో తనకు ట్రైనింగ్ ఇచ్చిన జిమ్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తిరిగి తన సొంత దేశానికి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆయనని ఉద్దేశించి హృతిక్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా పోస్ట్ లో ఆమన ఏమన్నారంటే.. పని పట్ల శ్రద్ధ, నిబద్దత కలిగిన మీ లాంటి వారిని చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది. నిజానికి ప్రపంచానికి మీ లాంటి వారే కావాలి, మీకోసం ఎదురుచూస్తుంటాను ఎమోషనల్ పోస్ట్‌ రాసుకొచ్చాడు హృతిక్‌.

ఇక ఎంతో ప్రేమతో హృతిక్‌ రోషన్ పెట్టిన  పోస్ట్‌కు అతని జిమ్ ట్రైయినర్ క్రిస్‌ గెతిన్ కూడా అంతే ప్రేమగా స్పందించాడు. హృతిక్.. ది ఫైటర్ అంటూ రిప్లై  ఇచ్చాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఫైటర్‌ లో హ‌ృతిక్ జోడీగా  దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నారు టీమ్. ఈ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు స్టార్ హీరో. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?