
మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఒక్క కావడం కోసం పెద్ద యుద్ధమే చేశారని మంచు మనోజ్ చెబుతున్న మాటలను బట్టి అర్థమవుతుంది. తమ పెళ్లికి ఇంట్లో పెద్దవారే అడ్డంకిగా మారారనేది మనోజ్ మాటల్లోని అర్థంగా తెలుస్తుంది. మార్చి 3, 4వ తేదీల్లో వీరి వివాహం జరిగింది. అక్క మంచు లక్ష్మి అన్నీ తానై వీరి వివాహాన్ని జరిపించింది.
పెళ్లి రోజు మండపంలోనే తన భార్య అయిన మౌనికా రెడ్డి చేయి పట్టుకుని శివుని ఆజ్ఞ అని వెల్లడించారు మనోజ్. అందులో చిన్న బాబు కూడా ఉన్నారు. మౌనికారెడ్డి మొదటి భర్తకి జన్మించిన అబ్బాయి అన్నది ఆ సమయంలో వెల్లడయ్యింది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లకి తన భార్యతో దిగిన ఫోటోని పంచుకున్నాడు మనోజ్. పెళ్లి తర్వాత వీరిద్దరు చేసిన ఫోటో షూట్‌ని షేర్ చేసుకున్నారు. తాజాగా మంచు మనోజ్ భార్య మౌనికారెడ్డితో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇందులో అభిమానుల ప్రేమ, ఆశీస్సులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య మౌనికారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌కి ట్యాగ్ చేశారు.
ఈ సందర్భంగా ఇటీవల వీరిద్దరు కలిసి హాజరైన `అలా మొదలైంది` టాక్ షో ప్రోమోని పంచుకున్నారు. ఇందులో కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా నడుస్తున్న ఈ టాక్‌కి మనోజ్, మౌనికారెడ్డి హాజరయ్యారు. తమ జర్నీని వెల్లడించారు. ఎక్కడ స్టార్ట్ అయ్యారో తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ కామెంట్స్ ఆశ్చర్యపరిచాయి. `ఎన్నో సంవత్సరాలు మేం దేశదేశాలు తిరుగుతూ వనవాసం చేశాం. మౌనికాను వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. ఆమెకు అండగా ఉండకపోతే నేనే బతికే వేస్ట్ అనిపించింది. ఎన్నో డోర్లు మూస్తారో మూయండి` అంటూ కామెంట్లు పెట్టారు.
ఇందులో తమ ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది, ప్రేమ కోసం ఎలాంటి పోరాటం చేశారు?, ఎలా ఎదురించారు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అవన్నీ ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వీరి పెళ్లి మోహన్‌బాబుకి ఇష్టం లేదన్నారు. కానీ ఆయన పెళ్లికి హాజరై ఆ వార్తలకు చెక్ పెట్టారు. మరోవైపు అన్న మంచు విష్ణు జస్ట్ గెస్ట్ లా వచ్చిపోయారు. ఆయన ముఖంలో ఆనందం కనిపించడం లేదు. దీంతో అప్పుడే విభేదాలున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మంచు మనోజ్ ఇంట్లోకి వచ్చి విష్ణు గొడవ చేయడం, దాన్ని వీడియో తీసి ఇదిగో ఇలా ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తుంటారు, కొడుతుంటారని మంచు మనోజ్ పోస్ట్ చేయడం పెద్ద దుమారం రేపింది. మరి ఈ విషయాలన్నింటిని మనోజ్ ఈ టాక్ షోలో బయటపెట్టే అవకాశం ఉంది. ఈ ఎనల 18న ఈ పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇదిలా ఉంటే మంచు మనోజ్, మౌనికా పెయిర్‌ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్‌ఫెక్ట్ జోడీ అంటున్నారు. మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడముచ్చటగా ఉన్నారని అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక హీరోగా మనోజ్ బిజీ కాబోతున్నారు. ఆయన ఇటీవలే `వాట్ ది ఫిష్` అనే సినిమాని ప్రకటించారు. ఇది చిత్రీకరణ దశలో ఉన్నట్టు తెలుస్తుంది.