తారక్ తో కన్నీళ్లు పెట్టించిన బాలకృష్ణ కూతురు!

Published : Oct 21, 2018, 04:33 PM IST
తారక్ తో కన్నీళ్లు పెట్టించిన బాలకృష్ణ కూతురు!

సారాంశం

బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఒకటిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి తన అన్న తారక్ కు ఇటీవల కన్నీరు తెప్పించిందట.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత అందించిన విజయం నందమూరి ఫ్యామిలిలో ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పిందని చెప్పాలి. అసలైతే హరికృష్ణ మరణించకముందు నందమూరి హీరోల మధ్యన విభేదాలున్నాయని అయితే ఆ తరువాత ఇప్పుడన్ని కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

ఆ సంగతి అటుంచితే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఒకటిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి తన అన్న తారక్ కు ఇటీవల కన్నీరు తెప్పించిందట. చెల్లి ఇచ్చిన ఒక గిఫ్ట్ ను చూసి తారక్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. రీసెంట్ గా అరవింద సమేత చిత్రాన్ని చూసిన నారా బ్రాహ్మణి అన్నయ్యపై ప్రశంసలు కురిపించింది. 

అంతే కాకుండా తారక్ కోసం ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ను కూడా పంపించారు. హరికృష్ణ కు సంబందించిన పాత ఫొటోలు కలెక్ట్ చేసి వాటిని ఒక సిడిలో ఆల్బమ్ లా క్రియేట్ చేసి పంపించారు. దీంతో తారక్ చెల్లి పంపిన ఆ గిఫ్ట్ కు ఎంతో మురిసిపోయి తండ్రిని తలచుకొని భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్నాడు. పండగవేళ తన తండ్రిని మనస్ఫూర్తిగా గుర్తుచేసుకునేలా చేసిన బ్రాహ్మణి చెల్లికి కృతజ్ఞతలు తెలిపాడు తారక్. 

PREV
click me!

Recommended Stories

అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు
Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది