
మంచు మనోజ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవబోతున్నారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుని కలిశారు మంచు మనోజ్. తన సతీసమేతంగా ఆయన సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో కలిశారు. తమ బాబుతో కలిసి వచ్చారీ నూతన దంపతులు. గత మార్చిలో మంచు మనోజ్, మౌనికారెడ్డి లు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుని కలవడం ఆసక్తికరంగా, హాట్ టాపిక్‌గా మారింది.
అయితే మాజీ సీఎం చంద్రబాబుని నాయుడిని కలవడంపై మంచు మనోజ్ స్పందించారు. మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. తాము ఫ్యామిలీ మెంబర్స్ అని, ఎప్పుడూ ఆ ప్రేమాభిమానాలు తమ మధ్య ఉంటాయని చెప్పారు మంచు మనోజ్. పెళ్లి తర్వాత కలవాలని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. ఆయన ఆహ్వానం మేరకు తాము తమ బాబుతో వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నామన్నారు. రేపు తమ బాబు పుట్టిన రోజు అని, ఈ సందర్భంగా ఆయన్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మంచు మనోజ్.ద కాజ్వల్ డిస్కషన్స్ జరిగాయని చెప్పారు.
ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ, అది మంచి సందర్భం వచ్చినప్పుడు మౌనిక చెబుతారన్నారు మనోజ్. `అంకుల్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, బాబుతో వచ్చాము. చంద్రబాబుని కలవడం గొప్ప సందర్భంగా భావిస్తున్నాం. మేం ఏం చేయాలనుకుంటున్నామో పంచుకున్నారు. ఇది చాలా కాజ్వల్ ఫ్యామిలీ మీట్` అని చెప్పింది మౌనికారెడ్డి.
మౌనికా రెడ్డి పేరెంట్స్ భూమా నాగిరెడ్డి కాంగ్రెస్‌లో, ఆ తర్వాత టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం మౌనికా అక్కడ అఖిల ప్రియా టీడీపీలో నాయకురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచు మనోజ్ దంపతులు చంద్రబాబుని కలవడం ఆసక్తికరంగా మారుతుంది. మంచు మనోజ్ చెప్పినట్టు త్వరలోనే వీరు టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో మంచు మోహన్‌బాబు టీడీపీలో ఉన్నారు. రాజ్యసభ ఎంపీగానూ చేశారు. కానీ ఆ తర్వాత చంద్రబాబుతో దూరం పెరిగింది. వైసీపీలో చేరారు.
ఇదిలా ఉంటే ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య గొడవలు బయటపడ్డాయి. మోహన్‌బాబు, విష్ణు ఒక జట్టుగా, మనోజ్ మరో జట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికితోడు ఇటీవల ఇద్దరు కుమారులకు ఆస్తుల పంపకాలు కూడా చేశారు మోహన్‌బాబు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనోజ్ దంపతులు చంద్రబాబుని కలవడం అటు రాజకీయంగా, ఇటు సినిమా రంగం పరంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.