`రింగ్ మాస్టర్‌ నువ్వే`.. వర్మకి మంచు మనోజ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌..

By Aithagoni Raju  |  First Published Oct 19, 2021, 4:56 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ మరో ట్వీట్‌తో సంచలనాలకు తెరలేపారు. జోకర్స్ తో సిని`మా` నిండిపోయిందని పోస్ట్ చేశారు. దీంతో ఇది మరింత వివాదంగా, వైరల్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో దీనికి మంచు మనోజ్‌ స్పందించారు. వర్మకి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.


ఇటీవల జరిగిన `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా, వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీని తాలూకు వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌పై మంచు విష్ణు ప్యానెల్‌ విజయం సాధించడంతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే `మా` వివాదాలపై సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. తనదైన స్టయిల్‌లో ఆయన సెటైర్లు వేశారు. 

తాము సర్కస్‌ ఆడుతున్నట్టు సిని`మా` ప్రజలు ఆడియెన్స్ కి నిరూపించారని ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు Ram Gopal Varma. ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆయన మరో ట్వీట్‌తో సంచలనాలకు తెరలేపారు. జోకర్స్ తో cine maa నిండిపోయిందని పోస్ట్ చేశారు. దీంతో ఇది మరింత వివాదంగా, వైరల్‌గా మారుతుంది. 

Latest Videos

ఈ నేపథ్యంలో దీనికి మంచు మనోజ్‌ స్పందించారు. వర్మకి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. వర్మ స్టయిల్‌లోనే ఆయనకు పంచ్‌ వేయడం విశేషం. `మా` సర్కస్‌ అయితే అందులో `నువ్వు రింగ్ మాస్టర్‌` అంటూ వర్మని ఉద్దేశించి Manchu Manoj ట్వీట్‌ చేయడం విశేషం. దీంతో నెటిజన్లు సైతం మంచు మనోజ్‌కి సపోర్ట్ చేస్తూ వర్మపై పంచ్‌లు వేస్తున్నారు. ఆర్జీవీకి మైండ్ బ్లాంక్‌ అయినట్టే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి దీనికి వర్మ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1)

`మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌` ఎన్నికలు గత ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌ పోటీ పడగా, మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి 11 మంది విజయంసాధించారు. కానీ పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని, లెక్కింపులో అన్యాయం జరిగింది, తమపై మోహన్‌బాబు దాడి చేశారని ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు ఇందులో తాము కొనసాగలేమని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు పోలింగ్‌ రోజు సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ప్రకాష్‌రాజ్‌ ఈసీ అధికారులను కొరగా వారు నిరాకరించారు. దీంతో ఇప్పుడిది మరింత వివాదంగా మారుతుంది.

related news: 'మా' సభ్యులందరూ సర్కర్ లో జోకర్స్... మళ్ళీ రెచ్చిపోయిన వర్మ!

click me!