భార్య పుట్టిన రోజున మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భూమా మౌనికకి బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడంటే.. 

By Asianet News  |  First Published Oct 4, 2023, 3:37 PM IST

మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ సినిమా చేసి చాలా కాలమే అవుతోంది. కానీ పర్సనల్ లైఫ్ తో మనోజ్ మీడియాలో, సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు.


మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ సినిమా చేసి చాలా కాలమే అవుతోంది. కానీ పర్సనల్ లైఫ్ తో మనోజ్ మీడియాలో, సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు. ఆ మధ్యన మంచు మనోజ్ భూమా మౌనికని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అన్యోన్యంగా జీవిస్తూ కొత్త లైఫ్ ని ప్రారంభించారు. మంచు మనోజ్, భూమా మౌనిక వివాహంపై చాలా రూమర్స్ వినిపించాయి. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా మంచు మనోజ్ మౌనికని వివాహం చేసుకుంటున్నాడు అని కామెంట్స్ వినిపించాయి. అయితే మంచు లక్ష్మి దగ్గరుండి మనోజ్ మౌనికలకు వివాహం చేసింది. 

Latest Videos

ఇక మంచు విష్ణుతో మనోజ్ కి విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా నేడు భూమా మౌనిక తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా తన భార్యకి మనోజ్ బర్త్ డే విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

హ్యాపీ బర్త్ డే మున్నీలు.. ఈ రోజు నీ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మనల్ని కలిపిన ఈ కాలానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నువ్వు నా జీవితంలో వెలుగులు, నవ్వులు, సంతోషాన్ని తీసుకువచ్చావ్. మైలవ్ నీ పై ఎప్పుడూ అనంతమైన ప్రేమ కురిపిస్తూనే ఉంటాను. నీ సంతోషమే నాకు ముఖ్యం. దానికోసం ఏమైనా చేస్తాను అంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. 

click me!