కౌశల్ ఆర్మీకి మంచు మనోజ్ ధీటైన జవాబు!

Published : Sep 28, 2018, 11:46 AM IST
కౌశల్ ఆర్మీకి మంచు మనోజ్ ధీటైన జవాబు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేస్తోన్న హీరో నాని.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కౌశల్ ని టార్గెట్ చేశాడని కౌశల్ ఆర్మీ నానిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటు నాని.. కౌశల్ ని ఏం ప్రశ్నించినా.. అది కౌశల్ ఆర్మీకి తప్పుగానే కనిపిస్తుంది. దీంతో నాని నటించిన 'దేవదాస్' సినిమా ఫ్లాప్ చేస్తామని నానిని హెచ్చరించడం మొదలుపెట్టారు.

బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేస్తోన్న హీరో నాని.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కౌశల్ ని టార్గెట్ చేశాడని కౌశల్ ఆర్మీ నానిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటు నాని.. కౌశల్ ని ఏం ప్రశ్నించినా.. అది కౌశల్ ఆర్మీకి తప్పుగానే కనిపిస్తుంది. దీంతో నాని నటించిన 'దేవదాస్' సినిమా ఫ్లాప్ చేస్తామని నానిని హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇదంతా పక్కన పెడితే నిన్న థియేటర్ లోకి వచ్చిన 'దేవదాస్' హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 

ఈ సినిమాపై స్పందించిన హీరో మంచు మనోజ్.. ''దేవ అండ్ దాస్ కాంబో అంటేనే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇద్దరు చాలా అందమైన నటులను సింగిల్ స్క్రీన్‌పై చూడటం అనేది ఒక ట్రీట్‌. రోజురోజుకీ యంగ్ అవుతున్న నాగార్జున గారికి బెస్ట్ విషెస్'' అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు.

దీనిపై స్పందించిన కౌశల్ ఆర్మీ సభ్యుడు.. ''ఏం థ్రిల్లింగ్ భయ్యా.. మా కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు'' అని రిప్లై చేశాడు. దీనికి సమాధానంగా మంచు మనోజ్ ''సినిమా అనేది ఒక్కరిది కాదు.. ఎంతో మంది ఆకలి కష్టం.. ఎన్నో డిపార్ట్మెంట్లు రేయింబవళ్లు కుటుంబానికి దూరంగా ఉంటూ పని చేస్తారు.

ప్రతీ ఒక్క టెక్నీషియన్ మీద ప్రేమతో,గౌరవడంతో సినిమాని ఎంజాయ్ చేద్దామంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం మనోజ్ ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్