రాజకీయాల్లోకి మరో హీరోయిన్!

Published : Sep 28, 2018, 11:20 AM IST
రాజకీయాల్లోకి మరో హీరోయిన్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటించిన కొందరు తారలు ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఒకప్పుడు హీరోయినే.. నగ్మ, రోజా, విజయశాంతి ఇలా చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటించిన కొందరు తారలు ఆ తరువాతరాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఒకప్పుడు హీరోయినే.. నగ్మ, రోజా, విజయశాంతి ఇలా చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చారు.

ఇప్పుడు మరో హీరోయిన్ పాలిటిక్స్ లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. తమిళ నటి అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమె కొంత కాలానికే అతడి నుండి విడిపోయింది.

దానికి కారణం ధనుష్ అంటూ గతంలో చాలా వార్తలు వినిపించాయి. తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలిచే ఆమలపాల్ నటించిన 'రాక్షసన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆమెకి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..? అని ప్రశ్నించగా.. ''భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను'' అని క్లారిటీ ఇచ్చింది. అలానే రెండో పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం మరో పెళ్లి చేసుకోవాలనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?