మంచు మనోజ్.. ప్రేమికుల రోజున చాలా స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారు. తన భార్యతో కలిసి ఏకంతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ పిక్ వైరల్ అవుతుంది.
మంచు మనోజ్ గతేడాది తన ప్రేమికురాలు మౌనికా రెడ్డిని తన వశం చేసుకున్నారు. ఆయన భూమా మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మార్చిలో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. అక్క మంచు లక్ష్మి దగ్గరుండి వీరి పెళ్లి చేసింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. పబ్లిక్ మీటింగ్‌లు అయినా, ప్రైవేట్ కార్యక్రమాలైనా కలిసే కనిపిస్తున్నారు. అన్యోన్య దంపతులుగా రాణిస్తున్నారు.
తాజాగా ఈ జంట వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెళ్లి అయ్యాక వచ్చిన తొలి వాలెంటైన్స్ డే కావడంతో దాన్ని చాలా స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారు. వీదేశాలకు చెక్కేశారు. ఏకంతంగా తమ వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ఒకరికొకరు అండగా ఉన్నామనే భరోసా ఇచ్చుకున్నారు. ప్రేమించుకున్నారు. ప్రకృతిని ఆస్వాదించారు. సముద్రపు బీచ్ ఒడ్డున ఏకంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఒకరకొకరు ప్రేమని పంచుకున్నారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోని మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన వాలెంటైన్స్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఇద్దరు ఒకరినొకరు చూస్తూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక ప్రస్తుతం మంచు మనోజ్ `ఉస్తాద్‌ః ర్యాంప్ ఆడిద్దాం` టాక్ షో చేస్తున్నారు.సెలబ్రిటీలతో సాగే గేమ్ షో ఇది. ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. దీనికి మంచి ఆదరణ దక్కుతుంది.