బిగ్ బాస్ విన్నర్ అతడే.. మంచు మనోజ్ కామెంట్స్!

Published : Sep 19, 2018, 12:46 PM IST
బిగ్ బాస్ విన్నర్ అతడే.. మంచు మనోజ్ కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లో షో ముగుస్తుండడంతో హౌస్ మేట్స్ మధ్య వేడి చర్చలు మొదలయ్యాయి. రెండు రోజులుగా హౌస్ లో గొడవలు మరీ ఎక్కువయ్యాయి. 

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లో షో ముగుస్తుండడంతో హౌస్ మేట్స్ మధ్య వేడి చర్చలు మొదలయ్యాయి. రెండు రోజులుగా హౌస్ లో గొడవలు మరీ ఎక్కువయ్యాయి. ఒకరినొకరు కొట్టుకునే వరకూ వెళ్తున్నారు.

బిగ్ బాస్ సైతం హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చారు. అయినా.. ఈరోజు ఎపిసోడ్ లో కూడా హౌస్ మేట్స్ గొడవలకి దిగారు. ఇలాంటి పరిణామాల మధ్య బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారనే విషయంపై ఆసక్తి పెరిగిపోతోంది. హౌస్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు.

దీంతో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఓ నెటిజన్ మంచు మనోజ్ ని ప్రశ్నించారు. నీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరనుకుంటున్నావ్..? అన్నా అని ప్రశ్నించగా.. దానికి ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు మనోజ్. తనదైన స్టైల్ లో చిలిపిగా 'నాని' అని ఆన్సర్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

30 కోట్లు బడ్జెట్, 50 కోట్లకు డీల్, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డీమోంటె కాలనీ 3
ది గర్ల్ ఫ్రెండ్ నటుడి నుంచి క్రేజీ మూవీ, ఓజీ విలన్ నుంచి అదిరిపోయే థ్రిల్లర్.. ఓటీటీలో ఈ వారం సినిమాలు ఇవే