మణిరత్నం ఆదుకోకపోతే నిరాహార దీక్షే.. సినీ కార్మికుడు!

Published : Sep 19, 2018, 12:24 PM IST
మణిరత్నం ఆదుకోకపోతే నిరాహార దీక్షే.. సినీ కార్మికుడు!

సారాంశం

ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై లైట్ మెన్ గా పని చేసే ఓ కార్మికుడు సోమవారం ఫిర్యాదు చేశారు. మణిరత్నం ఆదుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారు. సినీ లైట్ మెన్ గా పని చేసిన ఆయన లైట్ మెన్ సంఘంలో సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు. 

పదేళ్ల క్రితం మణిరత్నం సినిమాలకు పని చేశానని, అభిషేక్ బచ్చన్ హీరోగా మణిరత్నం రూపొందించిన గురు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను విష జ్వరానికి గురైనట్లు తెలిపారు.

ఆసుపత్రిలో చేరగా రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తాను పేదవాడిని కావడంతో తమ వద్ద డబ్బు లేకపోవడంతో మణిరత్నం సహాయం కోరగా ఆయన స్పందించలేదని వెల్లడించారు.

లైట్ మెన్ సంఘం నుండి సహాయం చేయాలని కోర్టు ఆదేశించగా.. ఆ డబ్బు ఇవ్వడం కోసం ఆ సంఘం ఇరవై వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారనే విషయాన్ని బయట పెట్టాడు. మణిరత్నం సినిమాలకు పని చేసినందుకు గాను ఆయన మానవత్వంతో ఆర్ధిక సమయం చేయాలని కోరాదరు. లేకపోతే కుటుంబంతో సహా నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్