సెలబ్రిటీలతో మంచులక్ష్మీ బెడ్ టైమ్ స్టోరీస్!

Published : Sep 16, 2019, 02:11 PM ISTUpdated : Sep 16, 2019, 03:06 PM IST
సెలబ్రిటీలతో మంచులక్ష్మీ బెడ్ టైమ్ స్టోరీస్!

సారాంశం

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో చాలా మంది ఇంట్రస్ట్‌ చూప్తిస్తారు. ముఖ్యంగా సినిమా తారలపై ఉన్న ఆరాధనాభావంతో వాళ్లకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.   

మంచు లక్ష్మీ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. అలానే బుల్లితెరపై కొన్ని షోలను కూడా హోస్ట్ చేసింది. ఇప్పుడు మరో షోతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో ప్రసారమవుతోన్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' అనే షోని ఇప్పుడు తెలుగులో కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలో ఫన్ తో పాటు హాట్ గా ఉండే ఎన్నో విషయాలు సెలబ్రిటీలు 
షేర్ చేసుకుంటుంటారు.

అభిమానులకు తము ఆరాధించే సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే వారి నైట్ లైఫ్ గురించి.. వాళ్లు బెడ్ పైకి చేరిన తరువాత వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది..? రోజంతా వారికి ఎలా గడిచింది..? ఇలాంటి అంశాలతో పాటు ఎవరికీ చెప్పని కొన్ని విషయాలను ఈ షోలో చర్చిస్తూ ఉంటారు.

బాలీవుడ్ లో ఈ షో బాగా క్లిక్ అవుతోంది. అందుకే తెలుగులో కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి వ్యాఖ్యాతగా మంచు లక్ష్మీని తీసుకున్నారు. త్వరలోనే ఈ షో తెలుగులో ప్రసారం కానుంది. వయాకామ్ 18 ఈ క్రేజీ షోని నిర్వహించింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఈ షోని హోస్ట్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని చెప్పింది.

షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంటుందని.. అభిమాన సెలబ్రిటీల భావాలను.. రహస్యాలను తెలుసుకోవడానికి ఇది మంచి ప్లాట్ ఫామ్ అని అన్నారు. సెలబ్రిటీల్లో తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని.. వాళ్లందరితో చేసే సంభాషణల కోసం ప్రేక్షకులతో పాటు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు