మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపర్వం’. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కొత్త అవతారంలో సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.
మంచు లక్ష్మి (Manchu Lakshmi) నటిగా, ప్రొడ్యూసర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ముందుకు వెళ్తొంది. చివరిగా ‘పిట్టకథలు’, ‘మాన్ స్టర్’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అందించింది. ఈరోజు మంచు లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదలైంది.
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ రోజు (అక్టోబర్ 8)న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చచేస్తోంది.
చిత్రం గురించి దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ.. మంచు లక్ష్మీ ప్రసన్న ఇదివరకు చేయని పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర సరికొత్త గా ఉంటుంది. ఫీల్ గుడ్ లవ్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ గా అలరిస్తుందని తెలిపారు. పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు కూడా ఉన్నారు. ఈ చిత్రంతో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత, ఘోష్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.
ఇక పోస్టర్ లో మంచు లక్ష్మి అవతారం భయపెట్టేలా ఉంది. ఎర్రగుడి అమ్మారి నేపథ్యంలో 1990 లో జరిగిన కథగా ఈ సినిమా రాబోతుండటం.. అందుకు తగ్గట్టుగా మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ ను వదలడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. త్వరలో సినిమా గురించి మరిన్ని విషయాలను ప్రకటించనున్నారు.