ఆ మీమ్ వెన్నులో వణుకు పుట్టించింది

Published : Feb 23, 2021, 06:03 PM ISTUpdated : Feb 23, 2021, 06:05 PM IST
ఆ మీమ్ వెన్నులో వణుకు పుట్టించింది

సారాంశం

పిట్టకథలు సిరీస్ లో మంచు లక్ష్మీ లుక్ మరియు రోల్ పై అనేక రకాల మీమ్స్  రావడం జరిగింది. నెటిజెన్స్ తమ క్రియేటివిటీ పవర్ ఉపయోగించి రకరకాల మీమ్స్ చేశారు. అలాంటి మీమ్స్ లో ఒకటి మంచు లక్ష్మీకి తెగ నచ్చేసిందట. సదరు మీమ్ ఫోటో సోషల్ మీడియాలో పంచుకొని, తన స్పందన తెలియజేసింది మంచు లక్ష్మీ. 


తెలుగులో నెట్ఫ్లిక్స్ ఒరిగినల్స్ లో భాగంగా విడుదలైన ఆంథాలజీ సిరీస్ పిట్టకథలు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి మరియు తరుణ్ భాస్కర్ నాలుగు కథలను తెరకెక్కించడం జరిగింది. పిట్టకథలు సిరీస్ కి మిక్స్ రెస్పాన్స్ అందుకుంది. కాగా ఈ సిరీస్ లో మంచు లక్ష్మీ ఓ రోల్ చేశారు. 


స్వరూపక్క అనే ఓ పవర్ ఫుల్ లేడీ పొలిటీషియన్ రోల్ ఆమె చేయడం జరిగింది. పిట్టకథలు సిరీస్ లో మంచు లక్ష్మీ లుక్ మరియు రోల్ పై అనేక రకాల మీమ్స్  రావడం జరిగింది. నెటిజెన్స్ తమ క్రియేటివిటీ పవర్ ఉపయోగించి రకరకాల మీమ్స్ చేశారు. అలాంటి మీమ్స్ లో ఒకటి మంచు లక్ష్మీకి తెగ నచ్చేసిందట. సదరు మీమ్ ఫోటో సోషల్ మీడియాలో పంచుకొని, తన స్పందన తెలియజేసింది మంచు లక్ష్మీ. 


మోహన్ బాబు 500వ చిత్రంగా విడుదలైంది రాయలసీమ రామన్న చౌదరి. మోహన్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఆ మూవీలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. కాగా సినిమాలోని మంచు లక్ష్మీ లుక్ తో మంచు లక్ష్మీ పిట్టకథలు లుక్ ని పోల్చుతూ మీమ్ డెవలప్ చేశారు. సదరు ఫోటో తనకు వెన్నులో వణుకు పుట్టించిందని మంచు లక్ష్మీ తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్