మంచు ఫ్యామిలీ కొత్త పదాలు: నిన్న 'ఫసక్', నేడు 'నిలదీస్ఫై'!

Published : Dec 17, 2018, 04:18 PM ISTUpdated : Dec 17, 2018, 04:19 PM IST
మంచు ఫ్యామిలీ కొత్త పదాలు: నిన్న 'ఫసక్', నేడు 'నిలదీస్ఫై'!

సారాంశం

మంచు ఫ్యామిలీ వాడే కొత్త పదాలు చూస్తోంటే వీరేదో కొత్త భాష కనిపెట్టడానికి సిద్ధమావుతున్నారనిపిస్తుంది. అప్పుడెప్పుడో మంచు విష్ణు ఓ ఆడియో వేడుకలో 'డామ్న్' అంటూ ఒక పదం వాడాడు. 

మంచు ఫ్యామిలీ వాడే కొత్త పదాలు చూస్తోంటే వీరేదో కొత్త భాష కనిపెట్టడానికి సిద్ధమావుతున్నారనిపిస్తుంది. అప్పుడెప్పుడో మంచువిష్ణు ఓ ఆడియో వేడుకలో 'డామ్న్' అంటూ ఒక పదం వాడాడు. సోషల్ మీడియాలో అప్పుడు మంచు విష్ణుని విపరీతంగా ట్రోల్ చేశారు.

సినిమాల పరంగా మంచు కుటుంబం వెనుకంజలో ఉన్నా.. తమ యాక్షన్స్ తో తరచూ వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. ఇటీవల మోహన్ బాబు ఓ ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఫసక్' అనే పదం వాడాడు. ఇది ఎంతగా పాపులర్ అయిందంటే కొందమంది విదేశీయులు సైతం దీనిపై మీమ్స్ చేశారు.

ఈ విషయాన్ని మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ చాలా స్పోర్టివ్ గా తీసుకుంది. 'ఫసక్' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించింది. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీ నుండి కొత్త పదం బయటకి వచ్చింది. అదే 'నిలదీస్ఫై'.. ఎన్నికల పోలింగ్ సమయంలో మంచు లక్ష్మీ ఈ పదం వాడింది.

కానీ అందరూ ఎన్నికల్లో పడి దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ పదం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఈ పదం అర్ధం ఏంటో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు.

దీని మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరగుతోంది. మీమ్స్ కూడా ఒకదానిమీద ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరి మంచు లక్ష్మీ ఈ విషయంపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం
Karthika Deepam 2 Latest Episode: మీకు నాకంటే దీపే ఎక్కువన్న జ్యో-పారు మాటలను తండ్రితో చెప్పిన శౌర్య