Man Vs Bee: ప్రతి షాటూ రాజమౌళి సినిమా నుంచి కాపీనే.. ట్రైలర్ ఇదిగో..

Published : Jun 04, 2022, 04:39 PM IST
Man Vs Bee: ప్రతి షాటూ రాజమౌళి సినిమా నుంచి కాపీనే.. ట్రైలర్ ఇదిగో..

సారాంశం

ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మరో కొత్త ఒరిజినల్ మూవీతో రాబోతోంది. ఆ సిరీస్ పేరు 'మ్యాన్ వెర్సస్ బీ. అంటే మనిషికి తేనెటీగకి మధ్య జరిగే రసవత్తర పోరు. ఇందులో ప్రధాన పాత్రలో కామెడీ లెజెండ్ మిస్టర్ బీన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మరో కొత్త ఒరిజినల్ మూవీతో రాబోతోంది. ఆ సిరీస్ పేరు 'మ్యాన్ వెర్సస్ బీ. అంటే మనిషికి తేనెటీగకి మధ్య జరిగే రసవత్తర పోరు. ఇందులో ప్రధాన పాత్రలో కామెడీ లెజెండ్ మిస్టర్ బీన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. 

ట్రైలర్ చూస్తుంటే రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రం గుర్తుకు రాక మానదు. ఈగతో సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద చిన్నపాటి యుద్ధమే చేశారు రాజమౌళి. ఇక మ్యాన్ వెర్సెస్ బీ విషయానికి వస్తే ట్రైలర్ లో ప్రతి అంశం 'ఈగ' నుంచి కాపీ కొట్టినట్లే అనిపిస్తోంది. బహుశా మేకర్స్ ఈగ చిత్రం నుంచి ప్రేరణ పొంది ఈ మూవీ తెరకెక్కించారేమో చూడాలి. 

ఈగ మూవీలో.. నాని ఈగగా మారి సుదీప్ ని ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. మ్యాన్ వెర్సస్ బీ లో మిస్టర్ బీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈగ సుదీప్ ని ఎలా విసిగించిందో.. బీ కూడా మిస్టర్ బీని అలాగే ఏడిపిస్తోంది. 

ట్రైలర్ లో దాదాపుగా కనిపించిన సీన్స్ అన్నీ ఈగ చిత్రాన్ని పోలి ఉన్నాయి. కంప్లీట్ కామెడీ చిత్రంగా మ్యాన్ వెర్సెస్ బీ తెరకెక్కింది. జూన్ 24న నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సినిమాలో ఏమైనా మార్పులు ఉన్నాయి లేక ఈగ చిత్రాన్ని దించేశారా అనేది క్లారిటీ రావాలంటే ఈ నెల 24 వరకు వేచి చూడాల్సిందే. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌