దుమ్ములేపుతున్న ‘ది వారియర్’ సౌండ్ ట్రాక్స్.. లేటెస్ట్ గా ‘దడ దడ’మనే సూపర్ మెలోడీ సాంగ్..

Published : Jun 04, 2022, 02:34 PM ISTUpdated : Jun 04, 2022, 02:38 PM IST
దుమ్ములేపుతున్న ‘ది వారియర్’ సౌండ్ ట్రాక్స్.. లేటెస్ట్ గా ‘దడ దడ’మనే సూపర్ మెలోడీ సాంగ్..

సారాంశం

రామ్ పోతేనేని తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఈ సినిమా మ్యూజిక్ ట్రాక్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే ‘బుల్లెట్’ సాంగ్ మోతమోగుతుండగా.. లేటెస్ట్ గా సూపర్ మెలోడీని రిలీజ్ చేశారు మేకర్స్.    

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘ది వారియర్’. ఈ  చిత్రంలో రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందుకు తగట్టుగా తన మేకర్ ఓవర్ ను కూడా అదిరిపోయేలా మార్చేశాడు. మరోవైపు ఇస్మార్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేని తన అప్ కమింగ్ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరిగా ‘రెడ్’ అదరగొట్టిన రామ్.. ప్రస్తుతం తమిళ మాస్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో The Warriorలో నటిస్తున్నారు. రామ్ సరసన యంగ్ హీరోయిన్  కృతి శెట్టి (Kriti Shetty) విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది.  

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ వరుస  అప్డేట్స్ అందిస్తున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై వేరే లెవల్ లో అంచనాలను నెలకొల్పాయి. మరోవైపు ఈ చిత్రంలో మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తోంది. ఇది వరకే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘బుల్లెట్’ సాంగ్ ఇంకా మారుమోగుతూనే ఉంది. తాజాగా మేకర్స్ మూవీ నుంచి  సూపర్ మెలోడీని ‘దడ దడ’ అనే టైటిల్ తో రిలీజ్  చేశారు. 

సెకండ్ సింగిల్ గా రిలీజ్ అయిన ‘Dhada Dhada’ సాంగ్ కు సంగీ ప్రియులు  ఫిదా అవుతున్నారు. అంత చక్కటి లిరిక్స్ ను శ్రీమణి ఈసాంగ్  కు అందించారు. సింగర్ హరిచరణ్ మెలోడీ వాయిస్ తో అదరగొట్టాడు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) క్యాచీ ట్యూన్ అందించడంతో సాంగ్ వినసొంపుగా ఉందంటూ మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తున్నాడు.  జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?