అటు సమంతతో.. ఇటు రష్మికతో సినిమా.. ఎవరీ దేవ్ మోహన్...?

Published : Apr 12, 2023, 02:30 PM IST
అటు సమంతతో.. ఇటు రష్మికతో సినిమా.. ఎవరీ దేవ్ మోహన్...?

సారాంశం

సమంత జతగా శాకుంతలం సినిమాలో దుశ్యంతుడిగా నటించాడు మలయాళయంగ్ స్టార్ దేవ్ మోహన్. అటు రష్మిక మందన్నాతో కూడా ఒక సినిమా స్టార్ట్ చేశాడు. వచ్చి రావడంతోనే స్టార్ హీరోయిన్లతో నటిస్తున్న ఈ యంగ్ స్టార్ దేవ్ మోహన్  ఎవరు..? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..? సినిమాల్లోకి ఎలా వచ్చారు..? 


కొంత మంది నటీనటులకు ఎన్ని ఏళ్లయినా.. కెరీర్ లో గ్రోత్ ఉండదు.. పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం రాదు. స్టార్ డమ్ కు అల్లంత దూరాన ఉండిపోతారు. కానికొంతమందిమాత్రం కెరీర్ స్టార్ట్ చేసిన కొంత కాలానికే స్టార్ డమ్ తెచ్చుకుంటారు. ఊహించని విధంగా స్టార్ డమ్ తో మెరిసిపోతారు. అలాంటి వారిలో మలయాళ నటుడు దేవ్ మెహన్ కూడా ఒకరు. ఆయన కెరీర్ స్టార్టింగ్ లోనే సమంత, రష్మికలతో నటించే అవకాశం సాధించాడు. నిజానికి సమంత కంటే ఐదేళ్ళు చిన్నవాడైన దేవ్ మోహన్ శాకుంతలం సినిమాలో దుష్యంతుడిగా నటించారు. ఈనెల 14న శాకుంతలం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలు ఎంత వరకూ అందుకుంటుందో ఏమో ఈ సినిమా.. 

కెరీర్ స్టార్టింగ్ మలయాళ నటుడు, యంగ్ ఏజ్.. రెండు మూడు సినిమాలు చేసిన అనుభవం మాత్రమే.. మరి ఇంతలోనే టాలీవుడ్ లో అవకాశం ఎలా వచ్చింది. సమంతతో నటించే అవకాశం ఇచ్చింది ఎవరు..? అసలు ఎవరీ దేవ్ మెహన్.  ఎక్కడి నుంచి వచ్చాడీ హ్యాండ్సమ్ స్టార్. దేవ్ మెహన్ ది కేరళ రాష్ట్రంలోని త్రిశూర్. 1992లో జన్మించిన ఈ కుర్ర హీరో.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. బెంగళూర్ లో కొన్నాళ్ళఉ జాబ్ చేశాడు. ఫిజిక్ అన్నా.. ఫిట్ నెస్ అన్నా ఎంతో ఇష్టం ఈ కుర్ర హీరోకు.. దాంతో తన కొలిగ్ మోడలింగ్ చేయోచ్చు కదా అని సలహా ఇవ్వడంతో.. మెడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు. వీకెండ్ సెలవుల్లో మోడలింగ్ షోస్ చేస్తూ.. చిన్నగా ఇండస్ట్రీ కంట్లో పడ్డాడు. 

చాలా మంది స్టార్స్ లాగా.. దేవ్ మెహన్ కు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. కాని అనుకోని అవకాశం తనకు రావడంతో హీరోగా మారిపోయాడు. తన ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ సినిమా చేస్తూ.. కొత్తవారికోసం వెతుకుతుంటే.. తన స్నేహితుడి సలహా మీద.. ఇష్టం లేకుండానే ఆడిషన్ కు వెళ్ళి సెలక్ట్ అయ్యాడు దేవ్ మోహన్. కాని ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. కాని ఆసినిమాతో నటనమీద తనకు ఇంట్రెస్ట్ పెరిగింది. కాని దేవ్ మెహన్ ఫస్ట్ సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు. కోవిడ్ ప్రభావంతో అది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. కాని దేవ్ కు నటుడిగా మచి పేరు తెచ్చింది ఆసీనిమా ఏదో కాదు. సూఫియం సుజాతయం. ఈనినిమాతో నటనమీద ప్రేమ కలిగింది దేవ్ మోహన్ కి. వెంటనే అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. 

ఈ  సినిమాల సూఫీ తెలిసిన వ్యాక్తిగా దేవ్ నటన అద్భుతం అని చెప్పాలి. దాంతో సౌత్ లో మంచి పేరు వచ్చింది దేవ్ కు. ఆతరువాత అతను చేసింది మూడు సినిమాలే.. ఆ వెంటనే టాలీవుడ్ ఎంట్రీకి ఛాన్స్ రావడం అదికూడా తనకంటే ఐదేళ్లు పెద్ద.. స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించడం దేవ్ నమ్మలేకపోయాడు. ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. సూఫియం సినిమా చూసి.. నిర్మాత నీలిమా గుణ దేవ్ ను ఈసినిమాకు సెలక్ట్ చేసిందట. తెలుగులో నటన కొత్త అది కూడా సమంతతో నటించడం.. షూటింగ్ మొదటి రోజు సమంతతో చెప్పాడట దేవ్.. తనకు ఈ విషయంలో హెల్ప్ చేయమని. దాంతో సమంత తనకు అన్ని రకాలుగా సహకరించడంతో పాటు.. సినిమా విషయంలో హెల్ప్ చేసిందన్నాడు దేవ్. 

ఇక తను నటుడిగ మారి మూడు సినిమాలు చేసేవరకూ తన ఆఫీస్ లో ఈ విషయం తెలియదట. ఉద్యోగం చేస్తూనే చాలా కాలం పాటు సినిమాలు చేశాడట దేవ్. లుక్స్ మార్చుతున్నా.. సినిమా కోసం అని డౌట్ రాకుండా మేనేజ్ చేశాడట. ఫనాలా హీరో నీలాగా ఉన్నాడు అని కొలిగ్స్ అన్నా.. కూడా తానే ఆ హీరో అని చెప్పకుండా అచ్చంసినిమాలోలా మేనేజ్ చేశాడట. కొంత కాలానికి ఈ విషయం తెలిసి తన సహోద్యోగులు చాలా సంతోషించారన్నారు దేవ్. ఇక ప్రస్తుతం శకుంతలంతో పాటు..రష్మికతో కలిసి రెయిన్ బో అనే  మరో సినిమాలో నటిస్తున్నాడు దేవ్ మోహన్. టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఇక్కడే సెటిఅవుతాడేమో అని అంటున్నారు నెటిజన్లు. 

PREV
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే