ఈ మలయాళ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే నడవటం. దాంతో మనవాళ్లు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా మలయాళ సినిమాలదే హవా. ఓ ప్రక్కన భ్రమయుగం మరో ప్రక్క 'ప్రేమలు' దుమ్ము దులిపేస్తున్నాయి. ప్రేమలు మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫీల్ గుడ్ లవ్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజై కేరళలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.50+ కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మలయాళంలో ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయిన 'ప్రేమలు' త్వరలోనే తెలుగు వెర్షన్లోనూ రిలీజ్ కానుంది. అదే సమయంలో ఈ సినిమా ఓటీటి డీల్ కూడా లాక్ అయ్యినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ప్రేమలు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్‍ఫామ్ ‘డిస్నీ+ హాట్‍స్టార్’ Disney Hotstar సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ ని Asian Net కొనుగోలు చేసింది. రిలీజ్ అయ్యాక ఈ ఓటిటి రైట్స్ ని లాక్ చేయటంతో మొదట అనుకున్న దానికి రెట్టింపు వచ్చినట్లు సమాచారం. రిలీజ్ డేట్ విషయానికి వస్తే... గతంలో మలయాళ మూవీ కన్నూర్ స్క్వాడ్ సినిమా ఏడు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రేమలు కూడా ఓటీటీలోకి ఆలస్యంగానే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఆ లెక్క ప్రకారం మార్చి 22 – 25 తేదీలలో 45 రోజులు పూర్తై ఓటిటిలో రావచ్చు. ఇక ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి అఫీషియల్ గా మేకర్ల నుంచి ప్రకటన రాలేదు.
మరో ప్రక్క టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కార్తికేయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'ప్రేమలు సినిమాతో తొలిసారి డిస్ట్రిబ్యూషన్లో దిగుతున్నా. నేను మూవీ చూడగానే ఈ ఫార్ములా తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. మార్చిలో థియేటర్లలో కలుద్దాం' అని ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ సినిమాను మార్చి 8న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ తేదీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఈ సినిమాకు సంభందించి మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ఈ మలయాళ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే నడవటం. దాంతో మనవాళ్లు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ప్రేమలు చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రాస్తున్నారు. మాట్లాడుతున్నారు. చాలా సింపుల్ క్యూట్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హైదరాబాద్ లో కంటిన్యూ షోలు పడుతున్నాయి. ఓ ప్రక్కన మమ్ముట్టి భ్రమ యుగం ,మరో ప్రక్క ప్రేమలు చూడటమే వీకెండ్ లో పనిగా పెట్టుకున్నారు కుర్రకారు. ఈ సినిమాలో నల్సేన్ కె. గఫూర్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. క్లీన్ కామెడీ, యూత్ ఫుల్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమా తెలుగులోనూ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.