లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!

Published : Sep 18, 2019, 10:56 AM IST
లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!

సారాంశం

ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసిన లైంగికంగా వేధించినందుకు నటుడు దిలీప్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.  

రెండేళ్ల క్రితం ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ఓ నటిని కిడ్నాప్ చేయించి లైంగికంగా వేధించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ విషయంలో దిలీప్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

తాజాగా ఈ కేసు విషయంలో బాధితురాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించి లైంగిక వేధింపులు జరిగిన సమయంలో తీసిన వీడియోను నిందితుడికి కానీ అతడి సన్నిహితులకు కానీ ఇవ్వకూడదని కోర్టుని కోరారు. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా బాధితురాలికి సానుకూలంగా స్పందించింది.

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో తీసిన వీడియోలు నిందితుల చేతికి ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వాటిని అడ్డం పెట్టుకొని బాధితురాలిని బెదిరించడానికి ప్రయత్నిస్తారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో దిలీప్.. తాను ఏ నటినీ కిడ్నాప్ చేయించలేదని, అదే నిజమైతే వేధింపులకు పాల్పడిన సమయంలో రికార్డయిన విజువల్స్ ఏవన్నా ఉంటే తనకు ఇవ్వాలనిమెజిస్ట్రేట్ కోర్టును కోరారు.

దీనికి ఆ కోర్టు అంగీకరించలేదు. దాంతో అతడు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. దిలీప్ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి కాస్త సమయం కావాలని కేరళ ప్రభుత్వం కోరడంతో ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేసుపై స్తే విధించింది. ప్రస్తుతం దిలీప్ రిమాండ్‌లో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు