విశ్వక్ సేన్ సినిమాలో నాని కీ రోల్?

By Prashanth MFirst Published Sep 18, 2019, 10:40 AM IST
Highlights

ఫలక్ నుమా దాస్ సినిమాతో కొంత హడావుడి క్రియేట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే నెక్స్ట్ నాని ప్రొడక్షన్ లో వర్క్ చేయడానికి ఈ యువ హీరో సిద్దమవుతున్నాడు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో మొదట అ! అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 

నిర్మాతగా నాని క్లిక్కవ్వడంతో నెక్స్ట్ కూడా అదే తరహాలో ఒక డిఫరెంట్ సినిమా చేయాలనీ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఫలక్ నుమా దాస్ చూసిన నాని వెంటనే విశ్వక్ సేన్ తో కొత్త సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కథలో విశ్వక్ డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించే అవకాశం ఉందట. ఎవరు ఊహించని ట్విస్ట్ ల తో పాటు నాని గెస్ట్ రోల్ కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. 

నాని కథను మలుపు తిప్పే పాత్రలో ఆడియెన్స్ కి కిక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఆ సినిమా అక్టోబర్ లో లాంచ్ కానుంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టి జనవరిలో ఎండ్ చేయాలనీ ఆలోచిస్తున్నారు. అ! సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంతగా లాభాలు అందుకొని నాని ఈ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవుతాడో లేదో చూడాలి. ఈ నెల చివరలో సినిమాకు సంబందించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. 

click me!