షాకింగ్.. ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిన యువ నటి, ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి

Published : Sep 01, 2023, 12:56 PM IST
షాకింగ్.. ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిన యువ నటి, ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి

సారాంశం

చిత్ర పరిశ్రమలో వేదనకి గురిచేసే మరో షాకింగ్ సంఘటన జరిగింది. మలయాళీ నటి అపర్ణ పి నాయర్ తన నివాసంలోనే అనుమానాస్పదంగా మరణించారు.

చిత్ర పరిశ్రమలో వేదనకి గురిచేసే మరో షాకింగ్ సంఘటన జరిగింది. మలయాళీ నటి అపర్ణ పి నాయర్ తన నివాసంలోనే అనుమానాస్పదంగా మరణించారు. ఆమె వయసు కేవలం 31 ఏళ్ళు మాత్రమే. అంత పిన్న వయసులో అపర్ణ మరణించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. 

అపర్ణ తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించారట. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. తిరువనంతపురంలోని అపర్ణ ఇంట్లోనే ఈ సంఘటన జరిగింది. అయితే అపర్ణ ఎలా మరణించింది అనే వివరాలు ఇంకా బయటకి రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం జరిపిస్తున్నారు. ఆ వివరాలు ప్రకటిస్తే కానీ అపర్ణ ఎందుకు ఎలా మరణించిందని అనే మిస్టరీ వీడదు. 

అపర్ణ మలయాళంలో బుల్లితెరపై క్రేజీ నటిగా దూసుకుపోతోంది. ఆమెది సహజ మరణం కాదని తిరువనంతపురంలోని కరామనా పోలీసులు భావిస్తున్నారు. దీనితో దానికి తగ్గట్లుగా కేసు నమోదు చేశారు. 

అపర్ణ బులితెరపి చందనమాల, ఆత్మసఖి మైథిలి వీండుం వరం, దేవస్పర్శం లాంటి క్రేజీ సీరియల్స్ లో నటించింది. అలాగే వెండితెరపై కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. మేఘాతీర్థం, ముథుగావ్ లాంటి చిత్రాల్లో సైతం నటించింది. అపర్ణకి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలా పిన్న వయసులోనే అపర్ణ తన కుటుంబానికి ఈ లోకానికి దూరం కావడంతో సహచర నటీనటులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. అయితే అపర్ణ మృతిపై అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు కొనగిస్తేనే అపర్ణ మృతి వెనుక ఉన్న కారణాలు బయటకి వస్తాయి. 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన