కారులో విగతజీవిగా మలయాళ నటుడు... వినోద్ థామస్ మరణానికి కారణమేంటి..?

By Mahesh Jujjuri  |  First Published Nov 19, 2023, 11:30 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. రకరకాల కారణాలతో ఎంతో మంది తారలు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ మలయాళ నటుడు అనుమానాస్పద పరిస్తితుల్లో మృతి చెందాడు. 


వరుసగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మరణాలుచోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది తారలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. టాలీవుడ్ ను ఒకప్పుడే ఏలిన పెద్ద నటులంతా కాలం చేశారు.. తాజాగాచంద్రమోహన్ మరణం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. అటు మలయాళపరిశ్రమలో కూడా ఈ మధ్య సినీతారలు అనుమానస్పద పరిస్థితుల్లో మరణిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మలయాళ యంగ్ స్టార్స్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కొంత మంది సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఇలాంటి మరణమే ఒకటి ఇండస్ట్రీని కలవరపెడుతోంది. 

తాజాగా మరో మలయాళ నటుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మలయాళ నటుడు వినోద్ థామస్ మరణం ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఎలా మరణించాడో తెలియని  స్థితిలో మృతదేహం దొరకడంతో ఇది సంచలనంగా మారింది. ట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, వినోద్ మరణం గురించి వెలుగులోకి వచ్చింది.
 
కారులో విగతజీవిగా పడి ఉన్న ఆయనను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాం. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు అని స్థానిక పోలీసులు తెలిపారు. వినోద్ మరణానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. కారు ఏసీలోని విషపూరిత వాయువు పీల్చడంతో అతడు మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Latest Videos

అయితే పోస్ట్ మార్టం తరువాతే వినోద్ మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు  వెల్లడించారు. మాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు వినోద్.  హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి  సినిమాలో  వినోద్ థామస్ ను ఇండస్ట్రీలో నిలబెట్టాయి. చాలా చిన్న వయస్సులో అతని మరణం అందరిని బాధిస్తోంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి అతని మరణంపై సంతాపాలు వ్యాక్తం అవుతున్నాయి. 


 

click me!