వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమ.. పెళ్లి జరిగిపోయింది. ఇక మెగా ఫ్యామిలీలో ఈ ప్రేమ వివాహాలు ఇలానే కంటీన్యూ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. మరో మెగాహీరో వైష్ణవ్ తేజ్.. ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంట.. నిజమెంత...?
మెగా ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ ల ట్రెండ్ గట్టగా నడుస్తుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళాడిన సంగతి తెలిసిందే. ఇక మరో మెగా హీరో హీరోయిన్ లవ్ లో పడ్డాడట. ఆయన ఎవరో కాదు..మెగా మేల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వైరల్అవుతున్నాయి. అయితే ఈ వార్తలు
వరుణ్ తేజ్ పెళ్లికంటే ముందు.. ఈ జంటకు మెగా, అల్లు కుటుంబాలు ప్రీవెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేశాయి. అయితే, అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి నటి రీతూ వర్మ హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో రీతుతో వైష్ణవ్ తేజ్ క్లోజ్ గా కనిపించడంతో వీరిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. మెగా కాంపౌండ్‌లోని ఓ హీరోతో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందంటూ నెట్టింట చర్చ మొదలైంది.
వైష్ణవ్ తో రీతూ వర్మ ప్రేమలో ఉందని.. త్వరలోనే ఆమె కూడా మెగా ఫ్యామిలీలోకి కోడలిగా ఎంట్రీ ఇస్తుందని చాలా మంది కామెంట్లు చేశారు. ఈ వార్త వైరల్ అవ్వడం.. రకరకాల కామెంట్లు రావడంతో తాజాగా ఈ రూమర్స్ పై మెగా హీరో వైష్ణవ్ తేజ్ స్పందించాడు. తన ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ విధంగా స్పందించాడు. తాను ఎవరినీ ప్రేమించడంలేదని.. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.
అంతే కాదు లావణ్య త్రిపాఠీకి రీతూ మంచి స్నేహితురాలు కాబట్టే ఆమె పార్టీకి వచ్చిందని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆ కారణంతోనే పెళ్లి వేడుకల్లో సందడి చేసిందన్నారు. అంతకు మించి మరేమీ లేదని ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. అయితే గతంలో కూడా వైష్ణవ్ తేజ్ కు సంబంధించిన ప్రేమ వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన కృతీ శెట్టితో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే వాటిలో నిజం లేదంటూ.. అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాడు వైష్ణవ్.