మాలీవుడ్‌లో విషాదం.. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి

Published : Dec 21, 2020, 07:29 PM ISTUpdated : Dec 21, 2020, 07:30 PM IST
మాలీవుడ్‌లో విషాదం..  సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి

సారాంశం

మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యంగ్‌ స్టార్‌ హీరో, `ప్రేమమ్‌` ఫేమ్‌ నివిన్‌ పాలీ పర్సనల్‌ మేకప్‌మెన్‌ షాబు పుల్పల్లి  కన్నుమూశారు. ప్రమాదవశాత్తు ఆయన చెట్టుపై నుంచి పడి ఆదివారం దుర్మరణం చెందారు. 

మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యంగ్‌ స్టార్‌ హీరో, `ప్రేమమ్‌` ఫేమ్‌ నివిన్‌ పాలీ పర్సనల్‌ మేకప్‌మెన్‌ షాబు పుల్పల్లి  కన్నుమూశారు. ప్రమాదవశాత్తు ఆయన చెట్టుపై నుంచి పడి ఆదివారం దుర్మరణం చెందారు. క్రిస్మస్‌ స్టార్‌ని వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచినట్టు ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించింది. 

షాబు హఠాన్మరణంతో మాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తన సొంత మేకప్‌మేన్‌ మరణంతో హీరో నివిన్‌ పాలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. `బెంగుళూరు డేస్‌`, `విక్రమాదిత్యన్‌` చిత్రాలకు షాబు పనిచేశాడని నివిన్‌ పేర్కొంటూ తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతోపాటు ఉన్ని ముకుందన్‌, దర్శకుడు బోబన్‌ శామ్యూల్‌, మలయాళ మూవీ అండ్‌ మ్యూజిక్‌ డేటాబేస్‌ కూడా సంతాపాన్ని తెలిపారు. అనేక మంది మలయాళ సినీ ప్రముఖులు మేకప్‌మేన్‌ మరణంలో విచారాన్ని వ్యక్తం చేశారు. 

2012లో `పుతియా తీరంగల్‌` చిత్రంతో షాబు మేకప్‌మేన్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారట. మొదటి నుంచి నివిన్‌తోనే పనిచేసినట్టు తెలుస్తుంది. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్