
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా, గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య సరసన శృతిహాసన్(Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా రాజన్నసిరిసిల్లా జిల్లాలో సినిమా షూటింగ్ మొదలైంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో షూటింగ్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయింది. దాంతో ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. ఈ లోగా ఈ చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా ఈ చిత్రం లో బాలయ్య లుక్ ని రిలీజ్ చేసారు.
ఈ లుక్ చూసిన వారంతా ఈ సినిమా కన్నడంలో హిట్ అయిన `మఫ్టీ` సినిమాకి ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. శివరాజ్‌కుమార్(Siva Kumar) హీరోగా నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన `మఫ్టీ` సినిమా 2017లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. లీకైన బాలయ్య లుక్, విడుదల చేసిన ఫస్ట్ లుక్ ...మఫ్టీ సినిమాలో శివరాజ్‌కుమార్ లుక్ ఓకే విధంగా ఉండడంతో ఆ సినిమాకి ఇది రీమేక్ అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అది వాస్తవం కాదని స్ట్రయిట్ సినిమానే అని నిర్మాతలు పేర్కొన్నారు. దీనిపైన క్లారిటీ ఇచ్చారు. తమ కథ దర్శకుడు గోపీచంద్ మలినేని, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా కలిపి రాసుకున్నదని, ఏ భాషా చిత్రం నుంచి తీసుకున్నదని కాదని మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
అయితే క్లారిటీ ఇచ్చినా జనం నమ్మటం లేదు. మప్టీ సినిమాలో లుక్ ,స్టోరీ లైన్ తీసుకుని తమదైన శైలిలో గోపీచంద్ మలినేని కథ అల్లుకుని ఉంటాడని అంటున్నారు. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా సైతం ఓ తమిళ సినిమా బేస్ చేసుకుని తమ సొంతంగా అల్లారని ,ఈ సారి అదే జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి `జై బాలయ్య`, `వీరసింహారెడ్డి` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్ద్నాయి. దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.