
అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం మేజర్. 26\11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. అయితే అనుకున్న స్దాయిలో హిందీలో మాత్రం వర్కవుట్ కాలేదు. ది కాశ్మీర్ ఫైల్స్ స్దాయిలో హిందిలో ఓపినింగ్స్ వస్తాయని భావించారు. కానీ అది జరగలేదు. ఈ విషయమై రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మేకర్స్ ని మీడియాతో వారు ప్రశ్నించారు. దానికి సమాధానమిచ్చారు.
“మనం ప్రాక్టికల్ గా ఉందాం. శేషు హిందీ మార్కెట్ కు కొత్త. కాబట్టి అక్కడ స్లోగా స్టార్ట్ అయ్యింది. అయితే పాజిటివ్ సైన్ ఏమిటంటే...శుక్రవారం కలెక్షన్స్ ...సోమవారం కలెక్షన్స్ ఒకేలా ఉండటం,” అన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం వీకెండ్ లో మంచి ఆక్యుపెన్సీని చూసింది. వీక్ డేస్ స్టార్ట్ కావడంతో ఇకపై సినిమా ఎంత వరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది. అమెరికాలో త్వరలోనే 1 మిలియన్ క్లబ్బులో చేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సోనీ పిక్చర్స్‌తో కలిసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.