భారీ ధరకు 'మజిలీ' శాటిలైట్ రైట్స్!

Published : Mar 07, 2019, 10:28 AM IST
భారీ ధరకు 'మజిలీ' శాటిలైట్ రైట్స్!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో అందరి దృష్టి దీనిపై పడింది.

ఇప్పుడు సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని సమాచారం. ఒక్క శాటిలైట్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ ఐదు కోట్ల మొత్తాన్ని చెల్లించి సినిమా శాటిలైట్ హక్కులు పొందింది.

డిజిటల్ రైట్స్ ను అమెజాన్ కు మూడున్నర కోట్లకు తీసుకోగా.. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేటుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తోన్న ఈ సినిమాను 'నిన్ను కోరి' ఫేం దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో చైతు, సమంత మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ సినిమాకి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?