అలా చేస్తే నరకాల్సింది వేళ్లు కాదు.. దేవసేనకు అది తెలియదు

First Published Apr 29, 2017, 4:13 AM IST
Highlights
  • అలా చేస్తే నరకాల్సింది వేళ్లు కాదు..కుంతల యువరాణికది తెలియదు..అద్భుతమైన సీన్

తెలుగు సినిమా స్థాయిని ప్రంపంచ నలుమూలలా చాటిటెప్పిన ఘనత జక్కన్న రాజమౌళి మానసపుత్రి క బాహుబలి సినిమాకే సొంతం. ఆ సినిమాని ఏ ముహూర్తాన అనుకున్నాడో కానీ... కథ, కథనం.. రెండు పార్టులుగా తెరకెక్కించాల్సినంత గొప్పగా స్టోరీ ఉండటం అది రాసిన విజయేంద్ర ప్రసాద్ కు హ్యాట్స్ ఆఫ్.

 

ఈ చిత్రం కథ ఎంత బలంగా ఉందో.. కథనం సీన్ టు సీన్ అంతకు మించి అద్భుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. ఈ సినిమాలో రోమాంచితాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు ఎన్నో. అలాంటి సన్నివేశాల్లో ప్రభాస్ రథంతో ఇచ్చిన ఎంట్రీ మొదలు పెడితే చివరకు రానాతో చేసిన ఫైటింగ్ సీన్ తర్వాత చెప్పే నా మాటే శాసనం డైలాగ్ వరకు అన్నీ గూజ్ బంప్స్ తెప్పించేవే. ఇక మధ్యలో బాహుబలిని చంపమని శివగామీ దేవి కట్టప్పతో చెప్పడం, శివగామీ దేవిని కుంతల యువరాణి మాటలతో ఎదిరించడం, భల్లాలునికి అమ్మను చంపేద్దామని బిజ్జలదేవుడు చెప్పిన సన్నివేశం ఇలా అన్నీ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించినవే.

 

బాహుబలిని వరించిన దేవసేన ఓ సారి ఆలయానికి వస్తుంది. అయితే అప్పటికే మహారాజు కావాల్సిన బాహుబలి మహారాజుగా ప్రమాణం చేసిన భల్లాలదేవుడి కుట్రతో సర్వ సైన్యాధ్యక్ష పదవినీ వదిలేయాల్సి వస్తుంది. ఆ సమయంలో బాహుబలి సతీమణి దేవసేన ఆలయానికి వస్తుంది. అయితే బాహుబలి స్ఠానంలో పదవి చేపట్టిన సైన్యాధ్యక్షుడు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. చివరకు దేవసేనను కూడా అవమమానించాలని చూస్తాడు. కానీ కుంతల యువరాణిగా, బాహుబలి సతీమణిగా ఆత్మగౌరవమే ప్రతీకగా జీవించే దేవసేన అది గమనించి వెంటనే అతని వేళ్లు తెగనరుకుతుంది.

 

దీంతో దేవసేనను బంధించిన మాహిష్మతి సైన్యం పంచాయితీ పెడుతుంది. విచారణ జరుగుతుండగా సభా మందిరంలోకి బాహుబలి వస్తాడు. దేవసేన యువరాణికు ఇచ్చిన మాట మేరకు ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాహుబలిదే. అందునా నిర్దోషి అయిన దేవసేనను బంధిస్తే ఊరుకుంటాడా. అందుకే విచారణ సందర్భంగా నిజం చెప్పమని దేవసేనను అగుతాడు బాహుబలి. అప్పుడు జరిగిన విషయం వివరిస్తుంది దేవసేన.

 

ఇక అప్పుడు చూడాలి బాహుబలి అంటే ఏంటనేది. సభలో దేవసేన చెప్పినదంతా విన్న బాహుబలి తప్పుచేసావు దేవసేన అని గట్టిగా రౌద్రంతో అరుస్తాడు. దాంతో సభ మొత్తం అటెన్షన్ అయిపోతుంది. ఇక మరు క్షణం కూడా ఆలస్యం చేయకుండా... మహిళలను అవమానపరిస్తే నరకాల్సింది వేళ్లుకాదు.. దేవసేనా.. తల.. అని తల తెగనరికేస్తాడు. ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి ఒళ్లంతా రోమాలు నిక్కబొడుస్తాయి. ఒక్కసారి ఒళ్లు గగుర్పొడుస్తుంది. అది బాహుబలి అంటే. అందుకే.. రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇంత చదివాక మీరు టికెట్ కోసం ట్రై చేయకుంటే మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాల్సిందే. ముఖ్యంగా లేడీస్. సాహో బాహుబలి.

click me!