ఆ టైమ్‌లో రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యింది ః మహిమా చౌదరి

Published : Apr 07, 2021, 12:26 PM IST
ఆ టైమ్‌లో రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యింది ః మహిమా చౌదరి

సారాంశం

తాజాగా మహిమా తన మ్యారేజ్‌ గురించి, తన మిస్‌ క్యారీ గురించి పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. తనకు కార్‌ యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పింది. ఆ తర్వాత తన లైఫ్‌ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. 

`పర్దేశ్‌` స్టార్‌ మహిమా చౌదరి రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యిందట. అంతేకాదు కార్‌ యాక్సిడెంట్‌ విషయాలను వెల్లడించి షాక్‌ ఇచ్చింది. తన మ్యారేజ్‌ లైఫ్‌లోని ట్రబుల్స్ ని బయపెట్టిందీ మాజీ నటి. షారూఖ్‌ ఖాన్‌ నటించిన `పర్దేశి` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన మహిమా చౌదరి తొలి చిత్రంతో ఆకట్టుకుని ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకుంది. `దాగ్‌`, `దడ్కన్‌`, `దీవానే`, `కురుక్షేత్ర`, `ఖిలాడి 420`, `లజ్జా`, `దిల్‌ హై తుమ్హారా`, `దొబారా`, `సెహర్‌` వంటి చిత్రాలతో నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 

తాజాగా మహిమా తన మ్యారేజ్‌ గురించి, తన మిస్‌ క్యారీ గురించి పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. తనకు కార్‌ యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పింది. ఆ తర్వాత తన లైఫ్‌ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యిందట. తనకు మాతృత్వం పొందాలని ఉందని, కానీ రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యిందని చెప్పింది. దీంతో మానసికంగా ఎంతో స్ట్రగుల్‌ పడిందట. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిమా ఈ విషయాలను వెల్లడించింది. `మీకు వచ్చిన ఇబ్బందులను తల్లిదండ్రులకు చెప్పరు. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి. అలా దాస్తూ పోతుంటే వరుసగా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో నేను బిడ్డని కనాలని అనుకున్నా. కానీ గర్భస్రావం అయ్యింది. ఆ తర్వాత మరోసారి బిడ్డకోసం ప్రయత్నిస్తే మళ్లీ మిస్‌ క్యారీ అయ్యింది. ఆ సమయంలో నేను సంతోషంగా లేకపోవడానిక ఇదే కారణం.  ఆ తర్వాత తనకు పాప పుట్టిందని, నేను బయటకు వెళ్లి ఈవెంట్లు చేయాలనుకున్నప్పుడు పాపని తల్లి వద్ద ఉంచాను` అని చెప్పింది. 

తన తల్లి తనకు ఎంతో ధైర్యాన్ని, సపోర్ట్ నిచ్చిందని, తన కష్టాలను ప్రత్యక్షంగా చూసిందని, ఎంతో ఓదార్పునిచ్చిందని చెప్పింది. ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు. నీ లైఫ్‌లోని ఎత్తపల్లాలు చూశాను. కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండు అని చెప్పింద`ని పేర్కొంది. బాబీ ముఖర్జీతో ఏర్పడిన మనస్పార్థాల వల్ల వీరిద్దరు 2013లో విడాకులు తీసుకున్నారు. మహిమా తెలుగులో `మనసులో మాట` అనే చిత్రంలో నటించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్