మరోసారి అనారోగ్యానికి గురైన నటుడు కార్తిక్‌

Published : Apr 07, 2021, 10:58 AM IST
మరోసారి అనారోగ్యానికి గురైన నటుడు కార్తిక్‌

సారాంశం

సీనియర్‌ నటుడు కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.  కార్తీక్‌ ఇటీవల ఉన్నట్టు అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు.ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు.

సీనియర్‌ నటుడు కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.  కార్తీక్‌ ఇటీవల ఉన్నట్టు అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కార్తీక్‌ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. 

నటుడు కార్తీక్‌ ఆ మధ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏకంగా ఓ పార్టీని కూడా స్థాపించారు. కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన పార్టీని కూడా రద్దు చేశారు. ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనునట్లు ప్రకటించారు. అందులో భాగంగా ప్రచారం నిర్వహిస్తూ ఇలా కార్తీక్‌ అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్‌ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు