SSMB28 Update: మహేష్‌-త్రివిక్రమ్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. వచ్చేది అప్పుడే.. విశేషం ఏంటంటే?

Published : Aug 18, 2022, 05:31 PM ISTUpdated : Aug 18, 2022, 06:01 PM IST
SSMB28 Update: మహేష్‌-త్రివిక్రమ్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. వచ్చేది అప్పుడే.. విశేషం ఏంటంటే?

సారాంశం

మహేష్‌ బాబు తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. తన సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించడం విశేషం. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు(Maheshbabu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా(SSMB28) వస్తుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ కాంబో సెట్‌ అయ్యింది. చాలా రోజులుగా ఊరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. మహేష్‌ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే బిగ్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. 

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మహేష్‌ నటిస్తున్న 28వ చిత్రం కావడం, ఏప్రిల్‌ 28న విడుదల చేయడం విశేషం. మరోవైపు నాలుగు రోజుల లాంగ్‌ వీకెండ్ ఉండటం మరో విశేషం. అద్భుతమైన మెస్సీ లుక్‌, హై ఆక్టానే ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.  గ్రేట్‌ విట్‌నెస్‌ కోసం వేచి ఉండాలని తెలిపింది యూనిట్‌. 

ఈ చిత్రంలో మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. `మహర్షి` చిత్రం తర్వాత మహేష్‌, పూజా మరోసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ క్లారిటీ రాలేదు. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది.  సెప్టెంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాకి జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి