
మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేశారు. 44
సెకన్లపాటు ఉన్న ఈ మోషన్ పోస్టర్‌లో ఇండియన్ రూపీ స్ట్రక్చర్, రూపాయి బిల్లని మహేష్ ఎగిరేయడం చూపించారు.
రూపాయి స్ట్రక్చర్, బిల్లని ఎగిరేయడం వరకు బాగానే ఉంది. కానీ మోషన్ పోస్టర్ అసంపూర్తిగా ఉంది. పైగా అందులో వచ్చే టైటిల్ ట్రాక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సైతం ఏమాత్రం
ఆకట్టుకునేలా లేదు. బర్త డే అంటే అభిమాన హీరో కొత్త లుక్ చూడాలనుకుంటారు. కానీ ఈ సారి కొత్త లుక్ ఇవ్వలేదు. మహేష్ బర్త్ డే కానుకగా అభిమానులకు ఏదో ఒకటి
ఇవ్వాలి కదా అనేలా ఈ మోషన్ పోస్టర్ ఉంది తప్పిదే, ఏమాత్రం వర్క్ చేసినట్టుగా లేదు. దీంతో ఇందులో అభిమానులను ఖుషీ చేసే అంశం లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకి
గురవుతున్నారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడం వల్లే పూర్తిస్థాయిలో సర్‌ప్రైజ్ సిద్ధం చేయలేకపోయి ఉంటారని అనుకోవచ్చు.
ఇక `సర్కారు వారి పాట` చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని,
రవిశంకర్, గోపీఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ కూడా నిర్మాణంలో భాగంగా ఉన్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో
కీర్తిసురేష్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.