థియేట్రికల్ ట్రైలర్ కోసం మ‌హేష్ అభిమానులు వెయిటింగ్

Published : Sep 15, 2017, 08:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
థియేట్రికల్ ట్రైలర్ కోసం మ‌హేష్ అభిమానులు వెయిటింగ్

సారాంశం

తెలుగు త‌మిళ క‌న్న‌డ ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ పెంచుకున్న స్పైడ‌ర్ మూవీ మ‌హేష్ బాబు మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న స్పైడ‌ర్ సినిమా స్పైడ‌ర్ థియేట్రికల్ ట్రైలర్ కోసం మ‌హేష్ అభిమానుల ఉత్కంఠ‌

 

ఇటు తెలుగులో అటు తమిళంలో మెజారిటీ సినీ ప్రియుల దృష్టి స్పైడర్  థియేట్రికల్ ట్రైలర్ మీదే ఉంది. ఇంతకుముందు రిలీజ్ చేసి ‘స్పైడర్’ టీజర్ గ్లింప్స్టీ టీజర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటి విషయంలో అభిమానులు పూర్తి సంతృప్తితో లేరు. మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ అనగానే అభిమానులు ఇంకా ఎక్కువ ఆశించారు.

 ఐతే వాళ్ల ఆకలి తీర్చేలా థియేట్రికల్ ట్రైలర్ అదిరిపోతుందన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది చిత్ర యూనిట్ వర్గాల నుంచి. మురుగదాస్ సినిమా ఏదైనప్పటికీ థియేట్రికల్ ట్రైలర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతడి గత సినిమా ‘కత్తి’పై థియేట్రికల్ ట్రైలర్ భారీ అంచనాలు పెంచేసింది. ‘స్పైడర్’ ట్రైలర్ కూడా అలాగే ఉంటుందన్న ఆశతో ఉన్నారు మహేష్ అభిమానులు. ఈ ట్రైలర్ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు. తమిళ ఆడియన్స్ కూడా అంతే ఉత్కంఠతో ఉన్నారు. 

ఈ చిత్రానికి తమిళంలో కూడా మంచి హైప్ వచ్చింది. ఇటీవలే భారీ స్థాయిలో జరిగిన ఆడియో వేడుక కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్లో లాంచ్ కాబోయే థియేట్రికల్ ట్రైలర్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

 తెలుగులో ఇప్పటిదాకా ఏ ప్రమోషనల్ కార్యక్రమాలు చేయని ‘స్పైడర్’ టీం. ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రమోషన్ జోరు పెంచనుంది. వచ్చే పది రోజులు మహేష్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో. అటు తమిళనాట గట్టిగా ప్రమోషన్లలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?