మహేష్‌బాబు `సర్కారు వారి పాట` ఫస్ట్‌ నోటీస్‌ ఇచ్చేది అప్పుడే ?

Published : Jul 29, 2021, 06:50 PM IST
మహేష్‌బాబు `సర్కారు వారి పాట` ఫస్ట్‌ నోటీస్‌ ఇచ్చేది అప్పుడే ?

సారాంశం

ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న`సర్కారు వారి పాట` యూనిట్‌లో చలనం వచ్చింది. ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ మహేష్‌ని రంగంలోకి దించబోతున్నారు. 

`ఆర్ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌ ఊపందుకుంది. పవన్‌ కళ్యాణ్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ అప్‌డేట్లు ఇస్తూ జోరు పెంచారు. ఇతర యంగ్‌ హీరోలు తమ సినిమా అప్ డేట్లు ఇస్తూ తమ సినిమాలపై అందరిలోని అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న`సర్కారు వారి పాట` యూనిట్‌లో చలనం వచ్చింది. ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ మహేష్‌ని రంగంలోకి దించబోతున్నారు. ` సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఈ నెల(జులై) 31న ఫస్ట్ నోటీస్‌ పేరుతో మహేష్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి రెండు పోస్టర్లు విడుదల కాగా,అందులో మొదట మహేష్‌ హెడ్‌ బ్యాక్‌ సైడ్‌లో ప్రీ లుక్‌గా చూపించారు. మరోసారి చేతిలో కీస్‌ పట్టుకుని ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కానీ ఇప్పుడు మహేష్‌ ఫస్ట్ లుక్‌ని పంచుకోబోతున్నారు. ఓ రకంగా ఫ్రెండ్‌ షిప్‌ డే గిఫ్ట్ గా ఇది షేర్‌ చేయబోతున్నట్టు టాక్‌. ఇక ఈ చిత్రానికి `గీతగోవిందం` ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద