నేను చూసిన అత్యంత వినయపూర్వక వ్యక్తి షారూఖ్‌ః మహేష్‌ బర్త్ డే విశెష్‌

Published : Nov 02, 2020, 03:25 PM IST
నేను చూసిన అత్యంత వినయపూర్వక వ్యక్తి షారూఖ్‌ః మహేష్‌ బర్త్ డే విశెష్‌

సారాంశం

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కి బర్త్ డే విశెష్‌ల వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు.. షారూఖ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌ వేదికగా బాద్‌షాకి విశెష్‌ చెప్పారు.

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కి బర్త్ డే విశెష్‌ల వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు.. షారూఖ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌ వేదికగా బాద్‌షాకి విశెష్‌ చెప్పారు. `నాకు తెలిసిన అత్యంత వినయపూర్వకమైన వ్యక్తుల్లో ఒకరైన షారూఖ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడు ఆనందంతో, గొప్ప ఆరోగ్యం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు. మహేష్‌. 

ఈ సందర్భంగా షారూఖ్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇందులో షారూఖ్‌ ఏదో విషయం చెబుతుండగా, మహేష్‌, ఆయన భార్య నమ్రత వింటున్నారు. ఇదొక సినిమా షూటింగ్‌లో జరిగిన సన్నివేశంలా ఉంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇరు హీరోల ఫ్యాన్స్ దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు  సినీ సెలబ్రిటీలు షారూఖ్‌కి బర్త్ డే విశెష్‌ చెబుతున్నారు. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖులు ప్రధానంగా ఉన్నారు. నేడు షారూఖ్‌ 55వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?