తండ్రైన టాలీవుడ్ కమెడియన్, సోషల్ మీడియాలో ఏమని ప్రకటించాడంటే?

Published : Aug 24, 2025, 12:14 PM IST
 Mahesh Vitta

సారాంశం

టాలీవుడ్ యంగ్ కమెడియన్ మహేష్ విట్టా తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తాను తండ్రైన సందర్బంగా ఆయన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

DID YOU KNOW ?
బిగ్ బాస్ హౌస్ లో
కమెడియన్ మహేష్ విట్టా రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. బిగ్‌బాస్ 3వ సీజన్ తో పాటు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లలోనూ ఆయన పాల్గొన్నాడు.

టాలీవుడ్ కమెడియన్, బిగ్ బాస్ రియాలిటీ షో ఫేమ్ మహేష్ విట్టా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. మహేశ్ విట్టా తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య శ్రావణి రెడ్డి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ హ్యాపీ న్యూస్‌ను మహేష్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాబు చేతిలో పట్టుకుని ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, “Our bundle of joy is here” అనే క్యాప్షన్‌తో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మహేష్ విట్టా తన కెరీర్‌ను యూట్యూబ్వీడియోలతో ప్రారంభించాడు, తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బుల్లితెరపై, సోషల్ మీడియాలో పలు కామెడీ షోలద్వారా పాపులర్ అయిన మహేష్ విట్టా.. ఆతరువాత వెండితెరపై సందడి చేశాడు. వరుస అవకాశాలు సాధించాడు. టాలీవుడ్ లో "జాంబిరెడ్డి", "కొండపొలం" వంటి సినిమాల్లో కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండుసార్లు పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు మహేష్.

ఇక బిగ్ బాస్ షోలో ఉండగానే తాను శ్రావణి రెడ్డి అనే యువతిని ప్రేమిస్తున్నానని వెల్లడించాడు మహేష్. హౌస్ లోంచి బయటకు రాగానే, అదే ఏడాది ఆమెను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులు గత కొంతకాలంగా తమ జీవితంలోని ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. కొంత కాలం క్రితం శ్రావణి గర్భవతి అన్న వార్తను కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక గత నెలలో శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించగా, ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో షేర్ చేశారు.

తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తమకు బాబు జన్మించినట్టు ప్రకటించారు ఈజంట. ఈ కొత్త అతిథి అడుగుపెట్టడం వల్ల మహేశ్-శ్రావణి దంపతుల ఆనందానికి హద్దులే లేవు. సినీ పరిశ్రమ నుంచి ఆయన సహనటులు, బిగ్ బాస్ అభిమానులు, యూట్యూబ్ ఫాలోవర్స్ పెద్దఎత్తున మహేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం మహేశ్ విట్టా సినిమాలలో ఎక్కువగా కనిపించకపోయినా, కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రయోగాలను కొనసాగిస్తున్నాడు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు