చిరంజీవికి నిర్మొహమాటంగా నో చెప్పిన సాయిపల్లవి.. మహేష్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా?

Published : Jan 18, 2022, 07:05 AM IST
చిరంజీవికి నిర్మొహమాటంగా నో చెప్పిన సాయిపల్లవి.. మహేష్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా?

సారాంశం

ఇటీవల `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌`లోనూ ఆమె అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్‌ చేసింది. ఆడియెన్స్  ని  మరోసారి ఫిదా చేసింది. ఇదిలా ఉంటే సాయిపల్లవి ఇప్పుడు మహేష్‌ సినిమాలో నటించబోతుందనే టాక్‌ వినిపిస్తుంది.

సాయిపల్లవి(Sai Pallavi).. అంటే వెండితెరపై ఓ నృత్య తరంగం. ఆమె వేసే స్టెప్పులకు ఆడియెన్స్ పిచ్చెక్కిపోతారు. మైండ్‌ బ్లాక్‌ చేసేలా సాయిపల్లవి డాన్సులుంటాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌`లోనూ ఆమె అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్‌ చేసింది. ఆడియెన్స్  ని  మరోసారి ఫిదా చేసింది. ఇదిలా ఉంటే సాయిపల్లవి ఇప్పుడు మహేష్‌ సినిమాలో నటించబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. మహేష్‌బాబు(Maheshbabu),  త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే  పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని  సమాచారం. 

ఇదిలా ఉంటే ఇందులో ఇప్పటికే పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఆమెతోపాటు మరో హీరోయిన్‌కి  కూడా స్కోప్‌ ఉందట. అయితే చెల్లి పాత్రకి కూడా ప్రయారిటీ ఉంటుందని తెలుస్తుంది. సిస్టర్‌ సెంటిమెంట్‌తో సినిమా కథ సాగుతుందని, అందుకు సిస్టర్‌ రోల్‌ కోసం సాయిపల్లవిని అప్రోచ్‌ అయ్యారని తెలుస్తుంది. మరి అందుకు సాయిపల్లవి  ఓకే చెబుతుందా? లేదా అనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది. 

ఇదిలా ఉంటే ఇప్పటికే  చిరంజీవి(Chiranjeevi) సినిమాలో Sai Pallaviకి ఆఫర్‌ వచ్చింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `భోళాశంకర్‌` చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్రకి సాయిపల్లవిని అడగ్గా అందుకు ఆమె నో చెప్పింది. తాను రీమేక్‌ సినిమాలో చేయడం  ఇష్టం లేక నటించలేదని, అంతేతప్ప మరో కారణం కాదని `లవ్‌స్టోరి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సాయిపల్లవి వివరణ ఇచ్చింది. అయితే ఇప్పుడు చిరంజీవికి నో చెప్పి మహేష్‌కి ఎస్‌ చెబుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

అభిమానుల నుంచి మాత్రం ఆమె చెల్లిగా చేయోద్దనే కామెంట్‌ వినిపిస్తుంది. చెల్లి పాత్రలు చేస్తే కెరీర్‌  ప్రమాదంలో పడుతుందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కసారి  సిస్టర్స్ రోల్స్ చేస్తే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తుంటాయి. దీంతో ఇక వారిని హీరోయిన్‌గా  చూడటం  కష్టం. దీంతో సిస్టర్ రోల్స్ చేయోద్దంటున్నారు. ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చేస్తే తాము హ్యాపీ అనే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సాయిపల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

ఇటీవల `లవ్‌స్టోరి` చిత్రంతో, అలాగే `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న సాయిపల్లవి, ప్రస్తుతం `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. రానా సరసన అభ్యూదయ భావాలు కలిగిన అమ్మాయిగా కనిపించబోతుంది. దీనికి  వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..